నా కూతురును అందుకే చూపించడం లేదు... విరాట్ కామెంట్స్

విరాట్ కోహ్లీ పేరు తెలియని క్రికెట్ ప్రేమికుడు ఉండరంటే అతిశయోక్తి కాదు.అన్ని దేశాలలో క్రికెట్ కు ఉన్న ప్రాధాన్యత మన దేశంలో క్రికెట్ కు ఎంతటిదో మనకు తెలిసిందే.

 That's Why I'm Not Showing My Daughter Virat Comments, Virat Kohli,anushka Sharm-TeluguStop.com

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులకు ఓ కూతురు జన్మించిన విషయం తెలిసిందే.అయితే విరాట్ తన కూతురును ఇప్పటికీ బహిర్గత పరచని విషయం తెలిసిందే.

అయితే ఎందుకు అనేది ఇప్పటికీ విరాట్ అభిమానులకు అంతుపట్టని విషయంగా ఉంది.దీనిపై విరాట్ కూడా స్పందించలేదు.

కాని తాజాగా విరాట్ మరియు అనుష్క దంపతులు అభిమానులతో టచ్ లో ఇంస్టాగ్రామ్ లైవ్ ద్వారా ముచ్చటించారు.

ఈ సందర్బంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

విరాట్ కూతురు పేరు వామిక అంటే అర్థం ఏమిటని అడగగా దుర్గాదేవి అని విరాట్ తెలిపారు.మీ కూతురును ఎప్పుడు చూపిస్తారు అని అడగగానే సోషల్ మీడియాపై తనకు అవగాహన వచ్చిన తరువాతనే ప్రపంచానికి తాను పరిచయం అవుతుందని విరాట్ తెలిపారు.

ఈ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది.విరాట్ కూతురు వామిక ను ఎప్పడూ చూపిస్తారనే ప్రశ్నకు విరాట్ అభిమానులకు సమాధానం దొరికినట్టయింది.

ఇక విరాట్ త్వరలో వరల్డ్ టెస్ట్ సిరీస్ ఫైనల్ లో ఆడనున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube