మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్( Congress ) కు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి.ఇటీవల బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరి మునుగోడు అసెంబ్లీ టికెట్ దక్కించుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి.
మునుగోడు అసెంబ్లీ టికెట్ తప్పకుండా తనకే వస్తుందని ఆశించిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి చలమల్ల కృష్ణారెడ్డిలో ఆందోళన మొదలైంది.తనకు టికెట్ గ్యారెంటీగా వస్తుందని నమ్మకంతో ప్రచార రథాలను కూడా ఆయన సిద్ధం చేసుకుని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
అయితే చివరి నిమిషంలో తనకు టిక్కెట్ దక్కకపోవడం, ఆ టికెట్ రాజగోపాల్ రెడ్డికి కేటాయించడంతో కృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారట.
రాజగోపాల్ రెడ్డి ( Rajagopal Reddy )పార్టీలోకి తిరిగి రావడాన్ని స్వాగతించిన కృష్ణారెడ్డి మునుగోడు టిక్కెట్ తనకు ఇవ్వకపోవడాన్ని మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నారట.రాజగోపాల్ రెడ్డి రాష్ట్రస్థాయి నేత కావడం వల్ల ఎక్కడి నుంచైనా పోటీ చేసి గెలవగలరని , మునుగోడు మాత్రం తనకు వదిలి పెట్టాలని కృష్ణారెడ్డి చెబుతున్నారు .మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ( Congress party )కేడర్ ను కాపాడుకుంటూ వచ్చానని, అయినా రాజగోపాల్ రెడ్డికి టికెట్ కేటాయించడం తట్టుకోలేకపోతున్నానని అనుచరుల వద్ద కృష్ణారెడ్డి తన ఆవేదనను వ్యక్తం చేశారట.ఈ సందర్భంగా రాజకీయ భవిష్యత్తుపై అనుచరులతో సమావేశం నిర్వహించారట.వచ్చే ఎన్నికల్లో మునుగోడు నుంచి పోటీ చేయాలనే ఆలోచనకు కృష్ణారెడ్డి వచ్చారట.ఈ నేపథ్యంలోనే మునుగోడు నుంచి తాను పోటీ చేయబోతున్నట్లు కృష్ణారెడ్డి ప్రకటించారు.దీంతో రాజగోపాల్ రెడ్డి కూడా టెన్షన్ పడుతున్నారు.
కృష్ణారెడ్డిని ఏవిధంగా బుద్ధిజంచి దారికి తెచ్చుకోవాలి అనే విషయం పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారట. కృష్ణారెడ్డి మాత్రం తాను మునుగోడు( munugodu ) నుంచే పోటీ చేసే తీరుతానని ప్రకటించడంతో , కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి నాయకులు కృష్ణారెడ్డిని బుజ్జగించేందుకు రంగంలోకి దిగారట.ఈ బుజ్జగింపులకు లొంగకుండా కృష్ణారెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయవకాసాలను దెబ్బతీస్తుందనే టెన్షన్ కాంగ్రెస్ లో నెలకొందట.