మైనర్ బాలికతో టెన్త్ క్లాస్ అబ్బాయి ప్రేమాయణం.. కట్ చేస్తే రక్తపు మడుగులో శవమై..!

మహారాష్ట్రలోని వైజాపూర్ ప్రాంతంలో సచిన్ కాలే అనే 15 ఏళ్ల యువకుడు తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటూ టెన్త్ క్లాస్ చదువుతున్నాడు.ఇక రోజు ఇంటి నుండి స్కూలుకు వెళ్లే దారిలో ఓ మైనర్ బాలిక పరిచయమైంది.

 Tenth Class Boy Love Affair With Minor Girl Crime News-TeluguStop.com

వీరిద్దరూ కలిసి తరచూ మాట్లాడుకోవడంతో వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది.ప్రతిరోజు మాట్లాడుకోవడం, కలవడం, ఛాటింగ్ లు చేసుకోవడం చేసేవారు.

ఇక సచిన్ కాలే ఆ అమ్మాయి ఇంటికి ఎవరికీ తెలియకుండా వెళ్లి రావడం చేసేవాడు.ఒకరోజు రాత్రి ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి ఇద్దరూ సరదాగా కాసేపు మాట్లాడుకున్నారు.

అనుకోకుండా ఆ అమ్మాయి తల్లిదండ్రుల ముందు వీరిద్దరూ అడ్డంగా బుక్ అయిపోయారు.

బాలిక తండ్రి కోపంతో సచిన్ కాలే ను హత్య చేసి, శవాన్ని ఊరి పరిసర ప్రాంతాల్లో పడేశాడు.

ఆ శవాన్ని చూసినవాళ్లు పోలీసులకు సమాచారం అందించడంతో, ఆ ప్రాంతంనికి చేరుకొని పరిశీలించగా అది సచిన్ కాలే మృతుదేహంగా గుర్తించారు.సచిన్ కాలే తల్లిదండ్రులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.15 ఏళ్ల కుమారుడు హత్యకు గురవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తే సచిన్ కాలే ను హత్య చేసింది, అతని ప్రియురాలు తల్లిదండ్రులు అని తేలడంతో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

కాస్త ఆలస్యంగా ఈ సంఘటన వెలుగులోకి రావడంతో వైజాపుర్ అంతా తీవ్ర కలకలంగా మారింది.తల్లిదండ్రులు పిల్లల పట్ల శ్రద్ధ తీసుకోవాలని, పిల్లలు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో చాటింగ్ చేస్తున్నారు, స్కూలు కాలేజీలలో ప్రవర్తన ఎలా ఉంది అనే అంశాలపై శ్రద్ధ ఉండాలని, లేకపోతే లవ్ పేరుతో ఇలాంటి సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube