కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి.
మున్సిపల్ ఆఫీసు ముట్టడికి రైతులు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహారించారు.
అదేవిధంగా కార్యాలయం దగ్గరకు ఎవరూ రాకుండా రైతులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు.కాగా కామారెడ్డిలో పోలీస్ 30 యాక్ట్ అమలులో ఉందని, ఆందోళన కార్యక్రమాలు నిషేధమని వెల్లడించారు.
మరోవైపు ఆందోళనలు కొనసాగిస్తామని రైతులు తేల్చి చెబుతున్నారు.దీంతో మున్సిపల్ కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
ప్రభుత్వం తీసుకొచ్చిన మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలంటూ రైతులు గత నాలుగు రోజులుగా నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే.