వందకు వంద శాతం అన్ని ‌శాఖల‌ ఆడిటింగ్ ఆన్ లైన్లో జరిగే దిశగా అడుగులు‌ వేయాలి.. మంత్రి హరీశ్ రావు

వందకు వంద శాతం అన్ని ‌శాఖల‌ ఆడిటింగ్, ఆన్ లైన్లో జరిగే దిశగా అడుగులు‌ వేయాలి.రంగారెడ్డి జిల్లాలో ప్రయోగాత్మకంగా ఆన్ లైన్ ఆడిటింగ్ ప్రారంభించాలి.

 Telangana Health Minister Hareesh Rao Comments Over Online Auditing Review Meeti-TeluguStop.com

ఆడిట్‌శాఖ గౌరవం మరింత పెరిగేలా పని చేద్దాం.ప్రతీ పైసా ప్రజలకు‌ చేరడమే లక్ష్యంగా ఆడిట్ శాఖ పని చేయాలి.

ఆర్థిక శాఖ హెచ్ వోడీలు, జిల్లా స్థాయి ఆర్థిక, ఆడిట్ అధికారులతో ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. పంచాయతీరాజ్ శాఖలో వంద శాతం ఆన్ లైన్ ఆడిటింగ్ చేసిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం‌ నుండి ప్రశంస లు పొందింది.

మీ అందరికీ అభినందనలు.ఆన్ లైన్ ఆడిటింగ్ తో పంచాయితీలు, మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో పూర్తి స్థాయిలో రికవరీ, అభ్యంతరాల పరిష్కారం చేసేలా అడుగులు వేయాలి.

స్థానిక‌ సంస్థలకు, ఇతర శాఖల నుండి వచ్చే అభ్యంతరాలకు సంబంధించిన పేరాలను పూర్తిగా పరిష్కరించాలని ఆదేశం.రంగారెడ్డి ‌జిల్లాలో ఈ మూడు నెలల్లో 2400 అభ్యంతరాలను ఆడిట్ చేసి పరిష్కరించడం ద్వారా కోటి 26 లక్షల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు జమ చేశారని, ఆ జిల్లా అదనపు కలెక్టర్ ను, ఆడిట్ సిబ్బందిని అభినందించిన మంత్రి హరీష్ రావు.

ఇదే రీతిలో అన్ని జిల్లాల్లో ఆడిట్ మీటింగ్స్ పెట్టి పూర్తిగా అభ్యంతరాలను పరిష్కరించాలి.ఈ ఐదారు నెలల్లో ఆయా శాఖలకు‌సంబంధించి పూర్తిగా ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఆడిట్ డిపార్ట్‌మెంట్ చర్యలు‌తీసుకోవాలి.

Telugu Hareesh Rao, Panchayat Raj, Review, Telangana-Political

ప్రజా ధనం వ్యర్థం కాకుండా‌ సరైన రీతిలో వినియోగం అయ్యేలా చూడటమే ఆడిట్ డిపార్ట్‌మెంట్ ముఖ్య విధి.ఆయా శాఖల‌వారీగా ఎక్కడైనా నిధుల దుర్వినియోగం జరిగిందా లేదా అని పకడ్బందీగా ఆడిట్ నిర్వహించాలి.నిధుల దుర్వినియోగం జరిగితే ఆ సమాచారం శాఖల‌ వారీగా తెప్పించాలి.జాయింట్ డైరెక్టర్లు తరచూ క్షేత్ర స్థాయిలో పర్యటించి ఆడిటింగ్ సమర్థవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం.

రైతు రుణ మాఫీ సరిగా జరిగిందా‌ లేదా పరిశీలన జరపాలి.బ్యాంకు వద్ద ఉన్న సమాచారం, సంబంధిత శాఖ వద్ద ఉన్న సమాచారం‌ సరిపోల్చుకోవాలి‌.

అదే రీతిలో వడ్డీ‌లేని రుణాలు, స్వయం‌సహాయక‌ బృందాలకు రుణాలు సరిగా అందుతున్నాయా లేదా పరిశీలించండి.బ్యాంకు‌ సాఫ్ట్ వేర్ ,అగ్రికల్చరల్ డిపార్ట్‌మెంట్ సాఫ్ట్ వేర్ లో లోపాలు లేకుండా‌‌‌ సరి చేసుకోవాలి.

ప్రభుత్వం విడుదల చేసే ప్రతీ పైసా లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది.జిల్లా ఆడిట్ అధికారులు, తమ జిల్లాల వారీగా ఆడిట్ అభ్యంతరాలు శాఖల‌వారీగా ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి.

Telugu Hareesh Rao, Panchayat Raj, Review, Telangana-Political

ఎన్ని పరిష్కరించారు, శాఖల‌వారీగా చేపట్టాల్సిన రికవరీ మొత్తం ఎంత, జిల్లా స్థాయిలో ఆడిటింగ్ సమావేశాలు నిర్వహించారా లేదా అన్న పూర్తి‌ సమాచారం సేకరించండి.జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు సమీక్ష నిర్వహిస్తా.అన్ని శాఖల ఆడిటింగ్ అంతా ఆన్ లైన్ లలో జరిగేలా‌ చర్యలు‌ తీసుకోండి.ముందుగా రంగారెడ్డి జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని ఆదేశం.ఆడిట్ డిపార్ట్‌మెంట్ గౌరవం మరింత పెరిగేలా పని చేయాలి‌.మీకు ఎలాంటి‌సహకారం కావాలన్నా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది.

ఎంసీహెచ్ఆర్డీ లో ‌జరిగిన ఈ‌సమీక్షలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్థిక సలహాదారు జీ.ఆర్ రెడ్డి, ఆర్థిక‌శాఖ‌ కార్యదర్శులు శ్రీదేవి, రోనాల్డ్‌రోస్, ఆర్థిక శాఖ విభాగాధిపతులు , అన్ని జిల్లాల ఆడిటింగ్ అధికారులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube