ప్రభుత్వ ఆసుపత్రిలో సాంకేతిక సమస్యలు... పట్టించుకోని అధికారులు

యాదాద్రి భువనగిరి జిల్లా: కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ హాస్పటల్ ల్యాబోరీటరిస్ అండ్ హబ్ లో సాంకేతిక సమస్యలు నెలకొన్నాయి.

గత కొంతకాలంగా థైరాయిడ్ సంబంధించిన రక్త పరీక్ష చేసే పరికరం పనిచేయక, రక్త పరీక్షలు ఇస్తే రిపోర్టర్ వస్తదన్న గ్యారెంటీ లేక రోగులు అవస్థలు పడుతున్నారు.

రిపోర్ట్ రాలేదని అడిగితే నిర్లక్ష్యంగా హబ్ లో కనుక్కోండని,హబ్ వారేమో బ్లడ్ క్లాట్ అయిందని, రిపోర్ట్ పేపర్ అడిగితే ప్రింటర్ లేదు,పేపర్స్ లేవని చెప్తున్న వైనంతో జిల్లా నలుమూలల నుండి వస్తున్న ప్రజలు పరేషాన్ అవుతున్నారు.స్మార్ట్ఫోన్ లేకపోతే రిపోర్టు రాదు,డాక్టర్ రాసినా ల్యాబోరీటరిస్ సిబ్బంది పరీక్ష చేయరు.

Technical Problems In Government Hospital Ignorant Officials, Technical Problems

ల్యాబ్ రిపోర్ట్ వస్తే కానీ, వైద్యం చేయలేమంటున్న డాక్టర్లు.హబ్ లో ఉన్న సమస్యలను మరియు హాస్పటల్ సిబ్బంది వైఖరి మారేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్న రోగులు.

రాజాసాబ్ సినిమాతో మారుతి స్టార్ డైరెక్టర్ గా మారబోతున్నాడా..?
Advertisement

Latest Yadadri Bhuvanagiri News