పొలిటికల్ యాక్షన్ షురూ చేసిన టిడిపి!

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు( Nara Chandrababu Naidu ) అరెస్టుతో ఒక కుదుపునకు లోనైన తెలుగుదేశం పార్టీ ఇప్పుడిప్పుడే తిరిగి పుంజుకుంటున్నట్లుగా తెలుస్తుంది.చంద్రబాబు అరెస్టు తదనంతర పరిణామాలతో ఢిల్లీ వెళ్ళిన లోకేష్ ( Nara Lokesh )అక్కడ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతూ చంద్రబాబు అరెస్టు( Chandrababu Arrest ) విషయాన్ని నేషనల్ మీడియాలో చర్చనీయాంశంగా మారేటట్లు చూశారు.

 Tdp Started Political Action , Tdp Party , Nara Chandrababu Naidu , Nara Lok-TeluguStop.com

రాజకీయంగా కూడా పార్లమెంట్లో ఈ విషయం చిన్నపాటి కుదుపుకు గురి చేసింది .

Telugu Acham, Chandrababu, Janasena, Lokesh, Tdp-Telugu Political News

అయితే ఇప్పుడు తన యువగళం పాదయాత్రను ( Yuvagalam Padayatra )కూడా తిరిగి ప్రారంభించాలని లోకేష్ అనుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.టీడీపీ కీలక నాయకులతో టెలికాన్ఫరెన్స్లో సమావేశమైన లోకేష్ వచ్చేవారం నుంచి యువగలం పాదయాత్రను తిరిగి తిరిగి ప్రారంభించాలని భావిస్తున్నట్లుగా తెలిపారట.అంతేకాకుండా చంద్రబాబు సూచనల ప్రకారం ఒక పొలిటికల్ యాక్షన్ కమిటీని కూడా టిడిపి ఏర్పాటు చేసింది.

పార్టీ కార్యక్రమాల నిర్వహణతో పాటు ఎన్నికల సన్నద్ధత పై కూడా ఈ టీం పని చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

Telugu Acham, Chandrababu, Janasena, Lokesh, Tdp-Telugu Political News

ఇందులో పార్టీ అధ్యక్షుడు అచ్చం నాయుడుతో పాటు నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ), వంగలపూడి అనిత, పయ్యావుల కేశవ ,నిమ్మల రామానాయుడు, బీద రామచంద్ర యాదవ్, షరీఫ్ మొదలగు వారు ఉన్నట్లుగా తెలుస్తుంది.ఇక పార్టీ కార్యక్రమాలను ఇక వేగవంతం చేసి ఎన్నికల దిశగా పార్టీని నడిపించాలని, వేగం పెంచాలని కూడా నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది .అంతేకాకుండా జనసేనతో పొత్తు కూడా అధికారికం గా మారినందున జనసేన( Janasena )తో కలిసి ఉమ్మడి కార్యాచరణ కూడా రూపొందించుకోబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.సీట్ల సర్దుబాటు, ఏనియోజక వర్గం లో ఏ పార్టీ బలం ఎంత ఉంది? రెండు పార్టీల మధ్య ఓట్ల ట్రాన్స్ఫర్ స్మూత్ గా జరగాలంటే తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? అన్న విషయాలను ఈ కమిటీ అధ్యయనం చేయబోతున్నట్లుగా తెలుస్తుంది .జనసేన తరపున కూడా ఇలాంటి క్రియాశీలక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి .ఈ కమిటీకి నాదెండ్ల మనోహర్ నాయకత్వం వహిస్తారు అని పవన్ ఇప్పటికే ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube