ఈ ఏడాది ఆరంభంలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు దారుణ పరాభవం ఎదురైన విషయం తెల్సిందే.ఆ సమయంలో జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన జాతీయ అధ్యక్షుడు పదవికి రాజీనామా చేశాడు.
ఆయనకు మద్దతుగా పలువురు పీసీసీ అధ్యక్షులు కూడా రాజీనామాలు చేశారు.కాని ఆ సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం రాజీనామా చేయలేదు.
తెలంగాణలో కాంగ్రెస్‌కు గౌరవ ప్రధమైన సీట్లను సాధించాను అంటూ చెప్పుకుని అప్పుడు రాజీనామా చేయలేదు.ఆ తర్వాత పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వెళ్తున్న సమయంలో ఆయన అడ్డుకోలేక పోయాడు అంటూ విమర్శలు వ్యక్తం అయ్యాయి.
చాలా కాలంగా పార్టీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్ వినిపిస్తుంది.రేవంత్ రెడ్డిని పీసీసీ చీప్ చేయాలంటూ చాలా మంది డిమాండ్ చేస్తున్నారు.కాని ఉత్తమ్ మాత్రం పార్టీ అధ్యక్ష పీఠంను అస్సలు వదిలేది లేదు అంటూ భీష్మించుకు కూర్చున్నాడు.కాని తాజా ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి రావచ్చు.
తన భార్యను గెలిపించుకోలేక పోయిన వ్యక్తి ఎలా పార్టీని నడిపిస్తాడు అంటూ ఉత్తమ్‌కు వ్యతిరేకంగా ఉన్న ఒక వర్గం వారు ప్రచారం చేస్తున్నారు.ఇప్పటికే ఆయనపై అధిష్టానం కాస్త ఎడమొహం పెడమొహం అన్నట్లుగా ఉంది.
ఇలాంటి సమయంలో పద్మావతి ఓటమి అది కూడా దారుణ పరాజయం అనేది ఉత్తమ్ పదవిపై ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు.ఇప్పటికైనా స్వచ్చందంగా తన పదవిని వదిలేస్తాడా లేదంటే అధిష్టానం పీకేసే వరకు చూస్తూ ఉంటాడా అనేది చూడాలి.