తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఆర్టీసీ కార్మికుల సంఘాల ఐకాసా నాయకుడు అశ్వత్థామరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.ఉద్యమం సమయంలో ఆర్టీసీ కార్మికులను వినియోగించుకున్న కేసీఆర్ ఇప్పుడు మా జీవితాలను నాశనం చేసేందుకు చూస్తున్నడు అంటూ వ్యాఖ్యలు చేశాడు.
మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా సమ్మెను విరమించేది లేదు అంటూ తేల్చి చెప్పాడు.తాము ప్రభుత్వం ముందు ఉంచిన 26 డిమాండ్లను తీర్చిన తర్వాతే ఉద్యోగాల్లో జాయిన్ అవుతామంటూ ఆయన ప్రకటించాడు.
ఈడీలు.బేడీలు అంటూ కమిటీలు వేసి సమ్మెను మాన్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఆ కమిటీలపై మాకు ఎలాంటి నమ్మకం లేదు.అసలు ఆ కమిటీల వల్ల జరిగే ప్రయోజనం ఏమీ లేదన్నాడు.
కేసీఆర్ నైతిక విలువలు లేకుండా సిగ్గు శరం లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు.అసలు ఆయన గతంలో ఇచ్చిన హామీలను పూర్తిగా మర్చి పోయాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
రేపటి నుండి ప్రతి స్కూల్ మరియు కాలేజ్‌లకు వెళ్లి తాము ఎదుర్కొంటున్న సమస్యలు మరియు తాము ఎందుకు సమ్మె చేయాల్సి వస్తుందో చెప్పబోతున్నట్లుగా ప్రకటించాడు.ఈనెల 30న భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రకటించాడు.







