మాకు మగపిల్లలు లేరనే భావనను ప్రభాస్ ఎప్పుడూ రానీయలేదు.. శ్యామలాదేవి కామెంట్స్ వైరల్!

స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) కెరీర్ పరంగా ఒక్కో మెట్టు పైకి ఎదుగుతుండగా ప్రభాస్ సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా మంచి కలెక్షన్లను సాధిస్తున్న సంగతి తెలిసిందే.ప్రభాస్ సినిమాలకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతున్న నేపథ్యంలో ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలతో బాహుబలి సిరీస్ తరహా సక్సెస్ లను సొంతం చేసుకుంటారని అదే సమయంలో త్వరలో పెళ్లికి సంబంధించిన తీపికబురు అందిస్తారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

 Syamaladevi Comments About Affection With Prabhas Details Here Goes Viral In So-TeluguStop.com
Telugu Salaar, Krishnam Raju, Prabhas, Project, Syamala Devi, Tollywood-Movie

ప్రభాస్ తో తనకు ఉన్న అనుబంధం గురించి శ్యామలాదేవి( syamaladevi ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారని తెలిపారు.ప్రభాస్ ఉండటం వల్ల మాకు అబ్బాయిలు లేరు అనే లోటు కూడా తెలియడం లేదని శ్యామలాదేవి చెప్పుకొచ్చారు.ఫ్యామిలీ అంతా చాలా క్లోజ్ గా ఉంటామని ప్రభాస్ నన్ను కన్నమ్మ అని పిలుస్తాడని శ్యామలాదేవి కామెంట్లు చేయడం గమనార్హం.ప్రభాస్ మనస్తత్వం కృష్ణంరాజు( Krishnam Raju ) గారి మనస్తత్వం అని శ్యామలాదేవి పేర్కొన్నారు.

Telugu Salaar, Krishnam Raju, Prabhas, Project, Syamala Devi, Tollywood-Movie

అందరితో సరదాగా ఉండాలని అందరికీ భోజనాలు పెట్టాలని ప్రభాస్ భావిస్తారని శ్యామలాదేవి అన్నారు.ప్రభాస్ చాలా మంచి అబ్బాయి అని శ్యామలాదేవి కామెంట్లు చేశారు.కృష్ణంరాజు కుటుంబం అంతటికీ గాడ్ అని ఆమె చెప్పుకొచ్చారు.మా ఫ్యామిలీ అందరికీ నేనంటే బాగా ప్రేమ అని ఆమె చెప్పుకొచ్చారు.కృష్ణంరాజు గారికి పిల్లలకు టైమ్ కు ఫుడ్ పెట్టకపోతే కోపం వచ్చేదని శ్యామలాదేవి అన్నారు.వచ్చే ఏడాది దసరా సమయానికి ప్రభాస్ వివాహం జరుగుతుందని శ్యామలాదేవి ఒక సందర్భంలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

ప్రభాస్ వయస్సు 44 సంవత్సరాలు కాగా 2024 సంవత్సరంలో ప్రభాస్ పెళ్లికి సంబంధించిన తీపికబురు చెబుతారేమో చూడాలి.స్టార్ హీరో ప్రభాస్ మార్కెట్ ఊహించని రేంజ్ లో పెరుగుతోంది.

ప్రభాస్ సలార్ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube