రేవంత్ రెడ్డి VS మనోహర్ రెడ్డి..నింద పోవాలంటే ప్రమాణం చేయాల్సిందేనా..?

ఇంకా కొన్ని నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ (Telangana Congress Party) లో రచ్చ మొదలైంది.ఇప్పటికే ఢిల్లీ లీడర్లు అంతా కలిసి కాంగ్రెస్ లో ఉన్నటువంటి సీనియర్ అసమ్మతి లీడర్లను బుజ్జగిస్తూ వస్తున్నారు.

 Suspended Congress Leader Manohar Reddy Shocking Allegations On Tpcc Chief Reva-TeluguStop.com

అంతా కలిసికట్టుగా పని చేసుకుని అధికారంలోకి వచ్చేదాకా సైలెంట్ గా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.ఇదే తరుణంలో బడా లీడర్లు కూడా సైలెంట్ అయిపోయారు.

ఇక అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నారు అనే తరుణంలో మరో వ్యవహారం తెరపైకి వచ్చింది.టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి (Revanth Reddy) టికెట్ల విషయంలో కోట్ల రూపాయల డబ్బులు తీసుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత మనోహర్ రెడ్డి ఆరోపించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియా ముందుకు వచ్చి రేవంత్ రెడ్డి పై సంచలన ఆరోపణలు చేశారు.రేవంత్ రెడ్డి మోనార్క్ లా వ్యవహరిస్తున్నారని, డబ్బులు ఇచ్చిన వారికే టికెట్లు కట్టబెడుతున్నారనే ఆరోపణలు చేయడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

ఎమ్మెల్యే టికెట్ విషయంలో బండంగ్ పేట్ మున్సిపల్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి (Chigurintha Parijatha Narasimhareddy) దగ్గర రేవంత్ రెడ్డి 10 కోట్ల రూపాయలు, 5 ఎకరాల భూమి తీసుకొని ఎమ్మెల్యే టికెట్ కన్ఫామ్ చేశారనే ఆరోపణలు చేశారు.

Telugu Etela Rajender, Kottamanohar, Narsimha Reddy, Revanth Reddy, Congress, Te

ఈ ఆరోపణలు సీరియస్ గా తీసుకున్న రేవంత్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి, కొత్త మనోహర్ రెడ్డి (Kotta Manohar Reddy) ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.సస్పెండ్ అయిన తర్వాత మనోహర్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి మరిన్ని ఆరోపణలు చేశారు.రేవంత్ రెడ్డి నిజాయితీగా ఉన్నట్లయితే, ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకోలేదని నిరూపించుకోవాలంటే భాగ్యలక్ష్మి గుడి దగ్గర ప్రమాణం చేయాలని మీడియా ముఖంగా సవాల్ విసిరారు.

Telugu Etela Rajender, Kottamanohar, Narsimha Reddy, Revanth Reddy, Congress, Te

గతంలో 25 కోట్లు తీసుకున్నారని ఈటెల రాజేందర్ (Etela Rajender) ఆరోపిస్తే, భాగ్యలక్ష్మి గుడి దగ్గర ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఎందుకు ప్రమాణం చేయట్లేదని, అప్పుడున్నంత రోషం ఇప్పుడు లేదా అంటూ ప్రశ్నించారు.ఒకవేళ రేవంత్ రెడ్డి అమ్మవారిపై ప్రమాణం చేయకపోతే తప్పనిసరిగా సీట్లు అమ్ముకున్నట్లు ప్రజలు భావిస్తారని తెలిపారు.

ఆయన టికెట్లు అమ్ముకోలేదని నిరూపించుకోవాలి అంటే తప్పనిసరిగా భాగ్యలక్ష్మి గుడి (Bhagyalakshmi Temple) దగ్గర ప్రమాణం చేయాలని సస్పెండెడ్ కాంగ్రెస్ నేత కొత్త మనోహర్ రెడ్డి ఆరోపించారు.మరి ఆయన ఆరోపణలను స్వీకరించి రేవంత్ రెడ్డి అమ్మవారి గుడిలో ప్రమాణం చేస్తారా లేదా అనేది సర్వత్ర ఆసక్తిగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube