‘RC16’ కోసం అప్పుడే ఆ పని స్టార్ట్.. ఎగ్జైటింగ్ న్యూస్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ( Ram Charan ) ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా ఎదిగి తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పరుచు కున్నాడు.ఇక ఈ సినిమా తర్వాత ఈయన లైనప్ పై పాన్ ఇండియా వ్యాప్తంగా ఇంట్రెస్ట్ పెట్టారు.

 Ram Charan Rc16 Movie Latest Update 2-TeluguStop.com

ఏ సినిమా చేస్తాడా? ఎప్పుడు కొత్త సినిమాతో వస్తాడా? అని ఆడియెన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.ప్రజెంట్ చరణ్ లైనప్ లో ఇద్దరు డైరెక్టర్లు ఉన్న విషయం తెలిసిందే.ఈ రెండు సినిమాల్లో బుచ్చిబాబు సానా ( Buchi Babu Sana ) ప్రాజెక్ట్ ఒకటి.RC16 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.బుచ్చిబాబు కూడా పక్కా ప్రణాళికతో స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాడు.

ఇక RC16 సినిమాను యూవీ క్రియేషన్స్ వారు గ్రాండ్ గా నిర్మిస్తుండగా.ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.తాజాగా ఈ మూవీ గురించి ఒక అప్డేట్ వైరల్ అయ్యింది.

ఈ సినిమాకు ఇప్పటికే రెహమాన్ వర్క్ స్టార్ట్ చేశారట.ఆల్రెడీ ఒక సాంగ్ కూడా ఫినిష్ చేసాడని అది ఓకే కూడా అయిపోయిందని తెలుస్తుంది.

అలాగే మిగిలిన మ్యూజికల్ పనులు కూడా శరవేగంగా జరుగుత్న్నట్టు తెలుస్తుంది.ఇలా బుచ్చిబాబు సెట్స్ మీదకు వెళ్లకుండానే పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళుతున్నాడు.

చరణ్ ప్రజెంట్ చేస్తున్న సినిమా పూర్తి అయితే కానీ ఈ సినిమాను స్టార్ట్ చేసే అవకాశం లేదు.ప్రస్తుతం రామ్ చరణ్ అగ్ర డైరెక్టర్ శంకర్ ( Shankar ) దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’( Game Changer ) సినిమాను చేస్తున్నాడు.ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ ( Kiara Advani ) హీరోయిన్ గా నటిస్తుంది.దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube