ట్రెడిషనల్ లుక్ లో స్టార్ బ్రదర్స్.. పంచెకట్టుతో ఇరగదీసారుగా..

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి తెలియని సినీ ప్రేక్షకులు లేరు.ఈయనకు కోలీవుడ్ లో మాత్రమే కాదు ఇండియా అంతటా ఫ్యాన్స్ ఉన్నారు.

 Suriya And Karthi At Viruman Audio Launch Details, Viruman Movie, Suriya, Karthi-TeluguStop.com

సూర్య నటనకు ఫిదా అవ్వని ఫ్యాన్స్ లేరు అంటే అతియసోక్తి కాదేమో.ఈయనకు తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది.

ఇక అప్పటి నుండి ఈయన నటించిన అన్ని సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు.సూర్య నటించిన జై భీమ్, ఆకాశమే నీ హద్దురా రెండు చిత్రాలు కూడా సూర్యను మరో మెట్టు ఎక్కించాయి.

ఇక ఇటీవలే సూర్య కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాలో క్యామియో రోల్ చేసిన విషయం తెలిసిందే.ఈ రోల్ కు విశేష స్పందన వచ్చింది.ఇక సూర్య మాత్రమే కాదు.ఆయన తమ్ముడు కార్తీ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈయనకు కూడా తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది.తెలుగులో ఊపిరి సినిమాలో కూడా నటించి మరింత దగ్గరయ్యాడు.ఇక ఇప్పుడు కార్తీ ముత్తయ్య దర్శకత్వంలో విరుమాన్ సినిమాను చేస్తున్న విషయం అందరికి విదితమే.యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో అదితి శంకర్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్ వచ్చాయి.

Telugu Aditi Shankar, Karthi, Suriya, Surya Karthi, Traditional, Viruman Launch,

ఇవన్నీ కూడా ఈ సినిమాపై ఇంట్రెస్ట్ పెంచాయి.ఇక తాజాగా ఈ సినిమా ఆడియో లాంచ్ గ్రాండ్ గా జరిగింది.ఈ ఈవెంట్ కు సూర్య, కార్తీ ఇద్దరు కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

అన్నదమ్ములు ఇద్దరు పంచె కట్టుతో వచ్చి అదరగొట్టారు.మధురై లో నిన్న రాత్రి ఈ ఈవెంట్ ఘనంగా జరిగింది.

ట్రెడిషనల్ లుక్ కు సంబందించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

ఇక ఈ ఈవెంట్ లోనే ట్రైలర్ కూడా రిలీజ్ చేసి ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేశారు.

విరుమాన్ సినిమాను ఆగష్టు 12న రిలీజ్ చేయబోతున్నారు.ఇక ఈ సినిమాను 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య, జ్యోతిక భారీ స్థాయిలో నిర్మించారు.

ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.మరి ఈ సినిమా ఎలా ఆకట్టు కుంటుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube