స్టార్ కిడ్ కి తప్పని కాస్టింగ్ కౌచ్ తిప్పలు.. అసలు విషయం బయట పెట్టిన నటి?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందనే విషయం మనకు తెలిసిందే.ఇలా సినిమా ఇండస్ట్రీలోకి అవకాశాల కోసం వచ్చిన ఎంతోమంది నటీమణులు కెరియర్ మొదట్లో ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నామని ఎంతో బహిరంగంగా వారు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను బయటపెడుతున్నారు.

 Star Kids Wrong Casting Couch Tippalu Actress Who Revealed The Real Thing Lakshm-TeluguStop.com

అయితే ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు కేవలం బయటి వారికి మాత్రమే ఉంటాయని స్టార్ సెలబ్రిటీల వారసులకు ఏ విధమైనటువంటి క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు లేకుండా ఎంతో సులభంగా అవకాశాలు వస్తాయని చాలామంది భావిస్తారు.అయితే ఇది పూర్తిగా తప్పని స్టార్ కిడ్స్ కి కూడా క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఉంటాయనీ మంచు వారసురాలు లక్ష్మీ ప్రసన్న వెల్లడించారు.

మోహన్ బాబు వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన లక్ష్మీప్రసన్న ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం కోసం ఎంతో కృషి చేస్తున్నారు.ఇప్పటికీ ఈమె పలు సినిమాలలో నటిగా నటించడమే కాకుండా బుల్లితెర కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా అలాగే నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

అయితే గత కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లక్ష్మీ ప్రసన్న తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందుల గురించి బయటపెట్టారు.తాను కూడా కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్నానని తనని చాలామంది బాడీ షేమింగ్ చేశారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Telugu Lakshmiprasanna, Mohan Babu, Shows-Movie

ఇలా ఇండస్ట్రీలో ఉన్నటువంటి నటీమణుల గురించి పెద్ద ఎత్తున ఏజ్, బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే మంచు లక్ష్మి ఈ విషయం గురించి మాట్లాడుతూ .తన బాడీ కర్వ్డ్ షేప్ ఉండటం వల్ల చాలామంది తనని బాడీ షేమింగ్ చేశారంటూ తనకు ఎదురైన చేదు సంఘటనలను బయటపెట్టారు.ఈ క్రమంలోనే లక్ష్మీ ప్రసన్న చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే లేచింది మహిళలోకం, అగ్ని నక్షత్రం వంటి సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube