నానిలో ఆ లక్షణం ఒక్కటైనా ఉందా అంటూ దారుణంగా అవమానించిన స్టార్ హీరో?

సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే సినీ బ్యాగ్రౌండ్ ఉంటేనే అవకాశాలు వస్తాయని అలాంటివారు మాత్రమే ఇండస్ట్రీలో సక్సెస్ అవుతారని చాలామంది భావిస్తుంటారు.కానీ ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి వారిలో నాచురల్ స్టార్ నాని( Natural Star Nani ) ఒకరు.

 Star Hero Insulted Natural Star Nani In Very Bad Manner, Natural Star Nani,tolly-TeluguStop.com

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి నాని కెరియర్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు.ఇలా అసిస్టెంట్ డైరెక్టర్ గా కొనసాగుతున్నటువంటి ఈయన అనంతరం అష్టా చెమ్మ ( Asta Chamma )సినిమాలో హీరోగా అవకాశం అందుకున్నారు.

Telugu Ashta Chamma, Dasara, Natural Nani, Tollywood-Movie

ఇలా హీరోగా మొదలైన ఆయన ప్రయాణం అంచలంచలుగా ఎదుగుతూ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు.తాజాగా ఈయన దసరా సినిమా ( Dasara Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏకంగా వంద కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టించారు.ఈ విధంగా సినీ బ్యాగ్రౌండ్ లేనటువంటి వారికి నాని ఎంతో ఇన్స్పిరేషన్ అని చెప్పాలి.అయితే సినీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాము అంటూ బహిరంగంగా చెబుతూ ఉంటారు అయితే ఇలాంటి అవమానాలు నానికి కూడా ఎదురయ్యాయని తెలుస్తోంది.

Telugu Ashta Chamma, Dasara, Natural Nani, Tollywood-Movie

నాని హీరోగా నటించిన అష్టా చమ్మా సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమంలో భాగంగా ఒక స్టార్ హీరో ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారట అయితే ఈ సినిమాలో హీరో ఎవరు అని తెలుసుకున్నటువంటి ఆయన నానిని చూసి చాలా హేళనగా మాట్లాడారని తెలుస్తుంది.అసలు వీడు హీరో ఏంటి హీరో అయ్యే లక్షణం ఒకటైన ఉందా అంటూ ఆ స్టార్ హీరో నానిని చాలా అవమానకరంగా మాట్లాడాలని తెలుస్తోంది.అయితే ఎవరైతే ఆరోజు అవమానించారో అదే స్టార్ హీరో చేత నేడు నాని ప్రశంసలు అందుకుంటున్నారు.ఇలా నానిని స్టార్ హీరో అవమానించారనే విషయం తెలియడంతో ఆ హీరో ఎవరా అంటూ ఆరాతీస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube