వాళ్ళ పళ్లు రాలగొట్టిన షారుఖ్ ఖాన్.. అప్పట్లో పెద్ద రౌడీనే?

బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తన స్టైల్ తో, నటనతో బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో ఎంతో మంది ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకున్నాడు.

 Sharukh Khan Completed His Education At St Columbus School Where He Wan An Excel-TeluguStop.com

ఇప్పుడు మనం షారుక్ ఖాన్ కు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.షారుక్ ఖాన్ 2005 సంవత్సరంలో ద ఇన్నర్ అండ్ ఔటర్ వరల్డ్ ఆఫ్ షారుక్ ఖాన్ అనే డాక్యుమెంటరీ విడుదల అయ్యింది.

దీనిని బీబీసీ ఛానల్ లో ప్రసారం చేయగా రెండు భాగాలుగా డాక్యుమెంటరీ టెలికాస్ట్ అయ్యింది.

మొదటి పార్ట్ లో షారుక్ ఖాన్ బాల్యం-విద్యాభ్యాసం, లాంటివి ప్రసారం చేయగా ఈ క్రమంలోనే షారుక్ ఖాన్ తన చిన్నప్పటి స్కూల్ కి వెళ్ళాడు.

హీరో షారుఖ్ ఖాన్ ఢిల్లీలో పుట్టి పెరిగాడు.ఆ తర్వాత ఎస్ ఆర్ కే స్థానిక పెయింట్ కొలంబస్ స్కూల్ లో చదువుకున్నాడు.

అక్కడికి మరోసారి తన డాక్యుమెంటరీ కోసం పయనం అయిన షారుక్ తన స్కూల్ ఆవరణలో కాసేపు గడిపాడు.దర్శక నిర్మాతలు షారుక్ ఖాన్ అక్కడ ఉన్న సమయాన్ని తమ డాక్యుమెంటరీలో నిక్షిప్తం చేశారు.

ఈ క్రమంలోనే షారుక్ ఖాన్ చిన్ననాటి సహచరుడు ఒకరు.అప్పట్లో నువ్వు మాడర్న్ స్కూలు విద్యార్థులలో చాలామంది పళ్ళు విరగ్గొట్టావు గుర్తుందా అని అడగగా.

ఆ ప్రశ్నకు షారుక్ ఖాన్ మాటలతో సమాధానం చెప్పకపోయినా నవ్వుతూ అవును అన్నట్టు తల ఊపాడు.

Telugu Bbc Channel, Bollywood, Child, Columbas School, Documentary, Sharukh Khan

ఈ క్రమంలోనే ద ఇన్నర్ అండ్ ఔటర్ వరల్డ్ ఆఫ్ షారుఖ్ ఖాన్ డాక్యుమెంటరీలో తన చిన్ననాటి స్కూల్ కు సంబంధించిన మరిన్ని ముచ్చట్లు చెప్పాడు.షారుక్ ఖాన్ చదువుకునే రోజుల్లో టాపర్ అయినప్పటికీ.అల్లరిలో కూడా ముందు ఉండేవాడట.

దానితో అప్పుడప్పుడు తనకు తీవ్రమైన అనారోగ్య సమస్య వచ్చి.క్లాసులో సృహ తప్పి పడిపోయే వాడట.అతని టీచర్లు కూడా అదంతా నిజమని నమ్మే వారట.సృహ తప్పినట్టు యాక్టింగ్ చేసిన ప్రతిసారి పెద్ద హడావిడి జరిగేదని ఆయనే స్వయంగా డాక్యుమెంటరీలో చెప్పుకొచ్చాడు.దీన్ని బట్టి చూస్తే షారుఖ్ ఖాన్ చిన్నప్పుడు రౌడీతో పాటు, మంచి విద్యావంతుడు అని కూడా తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube