ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

నల్లగొండ జిల్లా: తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి సోనియా గాంధీ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిందని, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి తెలంగాణ ప్రజలు ఆమె రుణం తీర్చుకున్నారని పలువురు కాంగ్రెస్ నేతలు అన్నారు.శనివారం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం పలువురు కాంగ్రెస్ నేతలు మాట్లడుతూ సోనియా గాంధీ జన్మదినం రోజునే తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచితంగా రూ.10 లక్షల వైద్య సౌకర్యం కల్పించడం సంతోషంగా ఉందన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపుతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని ప్రజామోద్యమైన జనరంజక పాలన కొనసాగుతుందన్నారు.

అవినీతి అక్రమాలకు తావులేకుండా ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ అహర్నిశలు కృషి చేస్తుందన్నారు.ప్రజల దీవెనలతో తల్లి సోనియమ్మ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.

Sonia Gandhi Birthday Celebrations In Nalgonda District, Sonia Gandhi, Sonia Gan

ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సర్టిఫికెట్లు ఎన్నిసార్లైనా మీ సేవలో తీసుకోవచ్చు...!
Advertisement

Latest Nalgonda News