సామాజిక చైతన్యంలో పాటది కీలక పాత్ర : ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

నల్లగొండ జిల్లా: నాటి సాంస్కృతిక పునరుజ్జీవం మొదలుకొని నేటి ఆధునిక సమాజం వరకు అనేక మార్పులకు కళా రంగమే దోహదపడిందని,వంద మాటల కన్నా ఒక్క పాట ద్వారా సమాజంలో మార్పు తీసుకురావచ్చని మిర్యాలగూడ ఎమ్మేల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు.ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఐఎంఏ హాల్లో మిర్యాలగూడ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సినీ స్వరాభిషేకానికి ఆయన ముఖ్యాతిథిగా హాజరై మాట్లాడుతూ.

పాటలు ఒక్క సామాజిక మార్పునకే కాక మానసిక ఉల్లాసాన్ని కూడా కలిగిస్తాయన్నారు.సమాజ గమనంలో కళాకారుల పాత్ర అత్యంత కీలకమని, పాట పాడడం అనేది ఒక గొప్ప వరంలా భావించాలన్నారు.

Song Plays A Vital Role In Social Consciousness MLA Bathula Lakshmareddy, Songs

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తమ్మడబోయిన అర్జున్, పొదిల శ్రీనివాస్,వార్డు కౌన్సిలర్ జలంధర్ రెడ్డి, మర్రి ఎలియాస్,వెంకన్న గౌడ్,కార్యక్రమ నిర్వహకులు శ్రీనివాసాచారి,కందుకూరి సుదర్శన్,సత్యనారాయణ చారి,ఏలే సత్యనారాయణ,సరస్వతి,మౌనిక,విద్యావంతుల వేదిక అంబటి నాగయ్య, వాకర్ అసోసియేషన్ నేత లక్ష్మయ్య,వంగాల సైదాచారి,ట్రాక్ నిర్వాహకులు సత్య పైళ్ల తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Nalgonda News