ఇండిగో వెబ్ సైట్ ను హ్యాక్.. అసలు ఎందుకు చేశారంటే..?!

కొన్ని కొన్ని సార్లు ప్రయాణం చేసేటప్పుడు అనుకోకుండా మన లగేజీ, విలువైన వస్తువులు మర్చిపోవడం గాని లేదంటే ఒకరి వస్తువులు వేరొకరు పొరపాటున తీసుకుని వెళ్లడం వంటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి.మనం ఎంత జాగ్రత్త పడినాగాని ఒక్కోసారి అలాంటి ఇబ్బందులు జరుగుతూనే ఉంటాయి.

 Software Engineer Nandan Kumar Hacks Indigo Website For His Lost Luggage Details-TeluguStop.com

ఈ క్రమంలోనే ఒక ప్రయాణికుడు మారిపోయిన తన లగేజీ కోసం చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయిన ఆ ప్రయాణికుడు తన లగేజీ కోసం ఏకంగా విమానయాన సంస్థ వెబ్‌సైట్‌నే హ్యాక్‌ చేసేసాడు.

అంతే కాకుండా అతను చేసిన ఈ పనిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టి మరి అందరికి షాక్ ఇచ్చాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.

నందన్‌ కుమార్‌ అనే ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఈ నెల 27న పాట్నా నుంచి బెంగళూరుకు ఇండిగో విమానంలో ప్రయాణం చేసాడు.అయితే ప్రయాణ సమయంలో అతడి బ్యాగ్‌ మాదిరిగానే ఉండే వేరే బ్యాగ్ ను తనది అనుకుని నందన్‌ కుమార్‌ తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు.

తీరా ఇంటికెళ్ళిన తర్వాత నందన్‌ భార్య ఈ విషయాన్ని గుర్తించింది.వెంటనే ఇండిగో ఎయిర్‌లైన్స్‌ కస్టమర్‌ కేర్‌ను నందన్‌ కుమార్‌ సంప్రదించి, బ్యాగ్‌లు మారిపోయిన విషయం వాళ్ళ దృష్టికి తీసుకుని వెళ్ళాడు.

Telugu Hack, Indigo Website, Indogo, Latest, Luggage, Nandan Kumar-Latest News -

కానీ, రూల్స్‌కు విరుద్ధంగా ఆ వ్యక్తి ఫోన్‌ నంబర్‌ ఇవ్వడం కుదరదని, ఆయనను కాంటాక్ట్‌ చేసి తిరిగి ఫోన్‌ చేస్తామని చెప్పారు.కానీ, ఎన్ని రోజులు గడుస్తున్న ఇండిగో కస్టమర్‌ కేర్‌ నుంచి ఎలాంటి కాల్ రాలేదు.ఇక తానే రంగంలోకి దిగి తన వద్ద ఉన్న బ్యాగ్‌పై సంబంధిత ప్రయాణికుడి పీఎన్‌ఆర్‌ ద్వారా ఇండిగో వెబ్‌సైట్‌ నుంచి వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా చెక్‌ ఇన్‌, ఎడిట్‌ బుకింగ్‌, కాంటాక్ట్‌ అప్‌డేట్‌ లాంటివి తెలుసుకోవాలని చూసాడు.కానీ.

, ఆ ప్రయత్నం కూడా ఫలించలేదు.

Telugu Hack, Indigo Website, Indogo, Latest, Luggage, Nandan Kumar-Latest News -

ఇక లాభం లేదు అనుకుని ఇండిగో వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌కు చేద్దాం అని భావించి డెవలపర్‌ కన్‌సోల్‌ కోసం కంప్యూటర్‌పై ఎఫ్‌12 ప్రెస్‌ చేసి అందులోని ప్రొగ్రామ్‌ను పరిశీలించి ఆ ప్రయాణికుడి మొబైల్‌ నంబర్‌, ఈ మెయిల్‌ ఐడీని తెలుసు కున్నాడు.అలా ఆ వ్యక్తికి ఫోన్‌ చేసి ఇద్దరూ ఓ చోట కలిసి బ్యాగ్‌లు కూడా మార్చుకోవడం జరిగింది.ఈ విషయాన్ని నందన్‌ కుమార్‌ ఇండిగో వెబ్‌సైట్‌ సంస్థ దృష్టికి తీసుకెళ్లాడు.

ఇండిగోకు ట్వీట్‌ చేసిన నందన్ ఐవీఆర్‌ను, కస్టమర్‌ సర్వీస్‌ను మరింతగా మెరుగు పర్చాలని సూచించారు.నందన్‌ ట్వీట్‌ పై స్పందించిన ఇండిగో అతడికి కలిగిన ఇబ్బందికి క్షమాపణలు చెప్పి వెబ్‌సైట్‌ లోని భద్రతాపరమైన లోపాలను సరిచేస్తామని పేర్కొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube