మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధుపై ట్రోలింగ్.. అసలు కారణాలు ఇవే!

హర్నాజ్ సంధు ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.భారతదేశానికి చెందిన 21 ఏళ్ల నటి మోడల్ అయిన హర్నాజ్ సంధు చైతన్య సృష్టించింది.

 Miss Universe 2021 Winner Harnaaz Sandhu Gets Body Shamed For Weight Gain In Fas-TeluguStop.com

గత ఏడాది ఇజ్రాయెల్ లో జరిగిన మిస్ యూనివర్స్ 2021 టైటిల్ ను సొంతం చేసుకుని వార్తల్లో నిలిచింది.దాదాపుగా 20 సంవత్సరాల తరువాత ఈ బ్యూటీ మన దేశానికి కిరీటాన్ని తీసుకువచ్చి ఎంతోమంది ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది.

అందాల పోటీలో ఈ భారతీయ ముద్దుగుమ్మ అనూహ్య విజయం సాధించి మిస్ యూనివర్స్ కిరీటాన్నీ సొంతం చేసుకుంది.

అయితే తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది హర్నాజ్ సంధు.

ముంబైలోని ఒక హోటల్లో లక్ష్మి ఫ్యాషన్ వీక్ 2022 జరుగుతున్న విషయం తెలిసిందే.అయితే అందులో ఎంతో మంది ప్రముఖులు ర్యాంప్ వాక్ చేసిన డిజైనర్లు రూపొందించిన దుస్తులను ప్రదర్శించారు.

ఇందులో భాగంగానే తాజాగా మిస్ యూనివర్స్ అయినా హర్నాజ్ సంధు సైతం షోలో ర్యాంప్ వాక్ చేసింది.ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆరెంజ్ డ్రెస్ లో అందంగా, బొద్దుగా, కొంచెం లావుగా కనిపించింది.

అయితే హర్నాజ్ సంధు శరీరంలో వచ్చిన మార్పుల కారణంగా ఇది నచ్చని కొందరు నెటిజన్స్ హర్నాజ్ సంధు పై నెగిటివ్ కామెంట్ చేయడం మొదలు పెట్టారు.ఇంకొందరు మాత్రం 20 సంవత్సరాల తరువాత మిస్ యూనివర్స్ కిరీటాన్ని భారత దేశానికి అందించిన యువతిని ఇలా బాడీ షేమింగ్ విషయంలో కామెంట్ చేయడం కరెక్ట్ కాదు అంటూ ఆమెకు సపోర్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు.అయితే ఆమెకు సపోర్ట్ గా కామెంట్స్ చేసే వారి కంటే, నెగిటివ్ గా కామెంట్స్ చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంది.

మరి ఈ విషయం పై హర్నాజ్ సంధు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube