నేను శృతిహాసన్ ఏపీకే హాట్ పెయిర్.. బాలయ్య కామెంట్లు వింటే షాకవ్వాల్సిందే!

స్టార్ హీరో బాలకృష్ణ మనస్సులో ఏదో దాచుకోరనే సంగతి తెలిసిందే.మనస్సులో అనుకునే మాటలను బయటకు చెప్పేస్తూ ఉంటారు.

 Shruti Hassan Balakrishna Is The Hot Pair Of Andhrapradesh Details Here Goes Vir-TeluguStop.com

కొన్నిసార్లు ఆ కామెంట్లపై విమర్శలు వచ్చినా వాటిని కూడా బాలయ్య పట్టించుకోరు.తాజాగా బాలకృష్ణ నేను శృతిహాసన్ ఏపీకే హాట్ పెయిర్ అంటూ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు తెగ్ వైరల్ అవుతున్నాయి.

అన్ స్టాపబుల్ షోలో భాగంగా బాలయ్య ఈ కామెంట్లు చేయడం గమనార్హం.

ప్రోమోలో జై బాలయ్య సాంగ్ కు రాశీఖన్నాతో పాటు జయసుధ, జయప్రద డ్యాన్స్ చేయడం గమనార్హం.

బాలయ్య రాశీఖన్నాతో ఊరికే నవ్వుతూ పడేస్తావ్.పడేస్తావ్ అంటూ కామెంట్లు చేయగా ఆ కామెంట్లకు రాశీఖన్నా మురిసిపోయారు.

నేను పడిపోయా పడిపోయా అని చెబుతూ బాలయ్య రాశీఖన్నాను తెగ నవ్వించారు.ఆ తర్వాత రాశీఖన్నా తన స్వీట్ వాయిస్ తో ఊహలు గుసగుసలాడే సినిమాలోని ఏం సందేహం లేదు పాటను అద్భుతంగా పాడి మెప్పించారు.

నాలుగు టకీలా షాట్ లు వేసేద్దామా అని బాలయ్య అడగగా రాశీఖన్నా కూడా ఓకే చెప్పి బాలయ్య చెప్పిన గేమ్ ఆడారు.షాట్స్ అంటే చాలు.

నా నాగిని ట్రాక్ లోకి వచ్చేసిందంటూ బాలయ్య కామెంట్లు చేశారు.ఆ తర్వాత బాలయ్య నేను శృతి హాసన్ ప్రస్తుతం హాట్ పెయిర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని వెల్లడించారు.

హీరోయిన్ అవ్వాలంటే కొన్ని విషయాలలో రాజీ పడక తప్పదని ఇది నిజమా అబద్ధమా అని బాలయ్య ముగ్గురు హీరోయిన్లను ప్రశ్నించారు.

ఉమెన్ సెంట్రిక్ సినిమాలను నిర్మించడానికి నిర్మాతలు 100 సార్లు ఆలోచిస్తారు నిజమా? అబద్ధమా? అని బాలయ్య అడిగారు.ఈ ప్రశ్నలకు హీరోయిన్లు చెప్పిన సమాధానాలు తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యేవరకు ఆగాల్సిందే.ఈ ప్రోమోకు యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తుండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube