తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు అరెస్టు( Chandrababu Arrest ) తర్వాత ఇప్పటివరకు ముఖ్యమంత్రి జగన్( CM Jagan ) ఈ విషయంపై స్పందించలేదు.అయితే కాపు నేస్తం నిధుల విడుదల సందర్భంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న జగన్ ఇప్పుడు ఈ విషయంపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు.అవినీతి చేస్తూ అడ్డంగా దొరుకుపోయిన వ్యక్తులను కాపాడడానికి కొన్ని దొంగల ముఠాలు ప్రయత్నిస్తున్నాయని, ఒకరు అవినీతిని సమర్దిస్తూ చెత్త పలుకులు పలుకుతుంటే మరొకరు ప్రశ్నిస్తానని చెప్పి పొత్తు లు పెట్టుకుంటున్నారని ఇంతకాలం పలుకుబడి కలిగిన ముఠాలు చంద్రబాబును రక్షించాయని ఇప్పుడు తమ పాలనలో చట్టం అందరికీ సమానమేనని,
తప్పు చేసిన ఎవరినైనా శిక్షిస్తామంటూ ఆయన స్పష్టం చేశారు.అవినీతిపై స్పష్టమయిన ఆదారాలతో చంద్రబాబు( Chandrababu Naidu ) బుక్ అయినా కూడా ప్రశ్నిస్తానన్న దత్త పుత్రుడు ఏమైపోయాడు? అంటూ పవన్ కళ్యాణ్ పై( Pawan Kalyan ) పరోక్ష విమర్శలు చేశారు.మూలాఖత్ ల పేరుతో మిలాఖత్ లు పెట్టుకుంటున్నారని తన మూలాఖత్ లు మిలాఖత్ లు అన్నీ ప్రజలతోనే అని స్పస్టం చేశారు .స్కిల్ స్కాం కేసులో అసలు సూత్రధారి పాత్రధారి చంద్రబాబు అని ఏపీ సిఐడి ఆధారాలు సేకరించింది కాబట్టే చట్టపరంగా ముందుకు వెళ్లిందని, అవినీతి చేస్తే అరెస్టు చేయకూడదా? అంటూ
ఆయన సూటిగా ప్రశ్నించారు.ఓటుకు నోటు కేసులో నల్లధనం ఇచ్చిన చంద్రబాబు అడ్డంగా బుక్కయ్యారని ఆ వాయిస్ ఆయనదే అంటూ ఫోరెన్సిక్ సర్టిఫికెట్ ఇచ్చినా కూడా కొందరు బుకాయించే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజల్ని మభ్యపెట్టే ప్రకటనలతో చెత్త పలుకులు రాస్తున్నారంటూ ఆయన ఆంధ్రజ్యోతి ఎండి ఆర్కే పై విమర్శలు చేశారు.సిఐడి అధికారులు సరైన ఆధారాలతో అరెస్టు చేయబట్టే బాబుకు బెయిల్ కూడా దొరకడం లేదని ఆయన స్పష్టం చేశారు.
దాంతో తాము చట్టప్రకారమే ముందుకు వెళ్తున్నామని ఎటువంటి రాజకీయ ప్రతీకారాలకు పాల్పడటం లేదని స్పష్టతను ఇచ్చే ప్రయత్నం ఆయన చేశారు
.