జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిస్థితులు ప్రభుత్వ సంసిద్దత చూస్తుంటే కొంత కాలం పాటు చంద్రబాబును జైలులోనే ఉంచే విధంగా ప్రభుత్వం చక్రం తిప్పుతున్నట్లుగా తెలుస్తోంది.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై పూర్తిస్థాయిలో ఫోకస్ పేట్టిన ప్రభుత్వం చంద్రబాబుకు( Chandrababu Naidu ) వ్యతిరేకంగా చాలా అస్త్రాలను సిద్ధం చేసుకున్నట్లుగా ఆ పార్టీ నాయకుల వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది.
ఇప్పుడు తీగ మాత్రమే దొరికిందని కదలాల్సిన డొంక చాలా ఉందంటూ వైసీపీ ( YCP party )కీలక నేతలు వ్యాఖ్యానించడం ద్వారా చంద్రబాబును చట్టపు పరిధిలో గట్టిగానే ఇరికిస్తున్నట్లుగా తెలుస్తుంది .అంతేకాకుండా లోకేష్ కూడా తొందర్లోనే లోపలికి వెళ్తారని ధీమాగా చెప్తున్న నాయకుల వ్యాఖ్యలు చూస్తుంటే తెలుగుదేశానికి ఇప్పటికిప్పుడు నాయకత్వ కొరత ఏర్పడే వాతావరణం కనిపిస్తుంది.ముఖ్యంగా ఇప్పటివరకు పార్టీని ఏకచత్రాధిపత్యంగా నడిపిన చంద్రబాబు ప్రతి చిన్న విషయంలోనూ తానే ముందుండి డైరెక్షన్స్ ఇస్తూ దిశా నిర్దేశం చేసేవారు.
గత కొన్నేళ్లుగా లోకేష్( Nara Lokesh ) కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ పూర్తిస్థాయి నిర్ణయాధికారం చంద్రబాబుదే .అలాంటిది ఇప్పుడు చంద్రబాబును కదలనివ్వకుండా ప్రభుత్వం అడ్డుపడితే పార్టీని కీలకమైన ఎన్నికల సమయంలో ఎవరు ముందుకు నడిపిస్తారన్నది ప్రశ్నార్ధకంగా మారింది నందమూరి కుటుంబం ముందుకు వస్తున్నప్పటికీ పార్టీ పై వారికి ఏ స్థాయి పట్టు ఉందన్నది అనుమానమే .బాలకృష్ణ( Nandamuri Balakrishna ) తాను రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని, ప్రభుత్వ అరాచకాన్ని ప్రజలకు వివరిస్తానని ప్రకటనలు ఇస్తున్నప్పటికీ చంద్రబాబును రిప్లైస్ చేసే నాయకుడు తెలుగుదేశంపార్టీ లో లేడు అన్నది అంగీకరించాల్సిన నిజం .
ఇప్పుడు ప్లాన్ బీ ని రెడీ తెలుగుదేశం నాయకత్వం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది.సాధ్యమైనంత తొందరగా చంద్రబాబును జైలు నుంచి విడిపించడం లోకేష్కు రాబోయే చట్టపరమైన ఇబ్బందులకు ముందుగానే విరుగుడు మంత్రాలు తయారు చేసుకోవడం ఇప్పుడు తెలుగుదేశానికి అత్యవసరంగా మారింది.మరోపక్క సమర్దవంతం గా కంపెనీ వ్యవహారాలు చూస్తున్న చంద్రబాబు కోడలు మరియు నందమూరి వారసురాలు అయిన బ్రహ్మాణి ( Brahmaani )ని పార్టీ పగ్గాలు అందుకునేలా తీర్చి దిద్దాలి అప్పుడుమాత్రమే పార్టీకి నాయకత్వ కొరత తీరుతుంది మరి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న తెలుగుదేశం ఏ మేరకు రాజకీయ చాణక్యాన్ని చూపించగలుగుతుందో వేచి చూడాలి.