ఇది రోడ్డా షాపింగ్ మాల్స్ అడ్డానా...?

నల్లగొండ జిల్లా: మిర్యాలగూడ పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ నడి రోడ్లపై షాపింగ్ మాల్స్ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.

దీనితో ఎదురుగా అవతల వైపు నుండి వచ్చే కనిపించక ప్రమాదాల బారినపడే అవకాశం ఉందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత కొన్ని నెలలుగా రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ కోసం గుంతలు తవ్వి రోడ్డు విస్తరణ పనులు చేస్తున్నారు.మిగిలిన రోడ్లను ఇలా ఫ్లెక్సీలతో నింపేస్తున్నారు.

దీనితో వానదారులకు ఎటు వెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు.నడిరోడ్డుపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మున్సిపల్ అధికారులకు కనిపించకపోవడం ఏమిటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా ఏర్పాటు చేసిన ప్లెక్సీలను వెంటనే తొలగించేలా స్థానిక ఎమ్మెల్యే,మున్సిపల్ చైర్మన్ చొరవ తీసుకుని, అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించి,వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement
తిప్పర్తిలో జూ.కళాశాల స్థల పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

Latest Nalgonda News