నిన్న‌టి వ‌రకూ సైకిల్ తొక్కిన ఆమె...నేడు విమానాలు న‌డుపుతుండ‌టంతో...

ఈ రోజుల్లో స్త్రీలు ఏ కోణంలో చూసినా పురుషుల కంటే తామేమీ తక్కువ కాద‌ని నిరూపించుకుంటున్నారు.అన్ని రంగాల‌లోనూ వారు దూసుకుపోతున్నారు.

 She Used To Ride A Bicycle Till Yesterday Today She Is Flying, Anshika, Muzaffar-TeluguStop.com

బీహార్‌లోని ముజఫర్‌పూర్ నివాసి అయిన 17 ఏళ్ల అన్షిక ఇది వంద‌కు వంద‌శాతం నిజమని నిరూపించించారు.కేవ‌లం త‌న 17 సంవత్సరాల వయస్సులో అన్షిక కమర్షియల్ పైలట్‌గా మొద‌టిసారిగా విమానాన్ని న‌డిపించారు.

ప్రస్తుతం అన్షిక ఒడిశాలో ఉండి శిక్షణ తీసుకుంటున్నారు.అన్షిక సాధించిన ఈ ఘనతతో ఆమె కుటుంబం మొత్తం ఆనందంలో తేలియాడుతోంది.

Telugu Anshika, Bicycle, Pilot, Dolphinpublic, Flighy, Ajay Singh, Kanhauli, Odi

ఒడిశాలో శిక్షణ పొందుతున్న అన్షిక‌ ముజఫర్‌పూర్‌లోని ముషారీ బ్లాక్‌లోని రోహువా గ్రామానికి చెందిన అన్షికా సింగ్ ఇటీవ‌లే కమర్షియల్ పైలట్‌గా ఎంపికైంది.ఇటీవ‌లే ఒడిశా విమానాశ్రయంలో అన్షిక ట్రైనీ పైలట్‌గా మొదటి విమానాన్ని విజయవంతంగా న‌డిపింది.ప్రస్తుతం అన్షిక ఒడిశాలోనే ఉంటూ శిక్షణ తీసుకుంటోంది.అన్షిక ఈ ఘనత సాధించడంతో ఆమె కుటుంబంతో పాటు బంధువులు, స్నేహితులు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు.కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ప్రతి తండ్రిలాగే, అన్షిక తండ్రి మాజీ చీఫ్ అజయ్ సింగ్ కూడా తన కుమార్తె సాధించిన ఘ‌న‌త‌చూసి ఎంతో ఆనంద‌ప‌డుతున్నారు.నిన్న‌టి వ‌ర‌కూ సైకిల్‌పై స్కూల్‌కి వెళ్లే తన కూతురు ఇప్పుడు పైలట్‌గా మారి విమానం నడుపుతుండ‌టం చూసి ఆయ‌న అమితంగా ఆనందిస్తున్నారు.

అన్షిక విజ‌యానికి ఈ ప్రాంతంలోనివారంతా ఆనందంలో మునిగితేలుతున్నార‌ని అన్షిక తండ్రి తన ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.

Telugu Anshika, Bicycle, Pilot, Dolphinpublic, Flighy, Ajay Singh, Kanhauli, Odi

పల్లెటూరి యువ‌త‌కు అన్షిక ఆదర్శం అన్షిక మధ్యతరగతి కుటుంబానికి చెందినది.అన్షిక డాల్ఫిన్ పబ్లిక్ స్కూల్, కన్హౌలీ నర్సరీ నుండి ఇంటర్ వరకు తన చదువును పూర్తి చేసింది.ఆ తర్వాత ఢిల్లీలో కమర్షియల్‌ పైలట్‌గా ఎంపికయ్యారు.

అన్షిక సాధించిన ఈ ఘనత పట్ల ఆమె స్కూల్ టీచర్లు కూడా చాలా సంతోషిస్తున్నారు.అన్షిక మొదటి నుంచీ బ్రిలియంట్ అని అన్షిక టీచర్లు చెబుతున్నారు.

ఆమె విజయానికి పాఠశాల మొత్తం ఆనందం వ్య‌క్తం చేస్తోంది.కష్టపడితేనే లక్ష్యాన్ని చేరుకోవచ్చని నిరూపిస్తూ పాఠశాలలోని ఇతర పిల్లలకు అన్షిక‌ స్ఫూర్తిగా నిలిస్తోంది.

మరోవైపు గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన అన్షిక సాధించిన ఈ ఘనత గ్రామీణ ప్రాంతాల్లో లక్ష్యం కోసం పోరాడుతున్న‌వారికి ఉదాహ‌ర‌ణ‌గా నిలిచింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube