అలాంటి పాత్రలకు దూరంగా నాగ్.. నిరుత్సాహంలో ఫ్యాన్స్..?

సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైన నాగార్జున తన సినీ కెరీర్ లో ఎక్కువగా రొమాంటిక్ సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే.అలాంటి సినిమాలే నాగార్జునకు గుర్తింపుతో పాటు నాగార్జునకు మన్మథుడు అనే ఇమేజ్ ను తెచ్చిపెట్టాయి.

 Senior Star Hero Nagarjuna Interested In Action Roles, Senior Star Hero Nagarjun-TeluguStop.com

అయితే ఇకపై నాగార్జున అలాంటి పాత్రలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుండటం గమనార్హం.

నాగార్జున నటించబోతున్న బంగార్రాజు సినిమా కథలో కూడా ఈ మేరకు మార్పులు జరిగాయని ఆ సినిమా వైవిధ్యంగా ఉండేలా మార్పులు జరిగాయని తెలుస్తోంది.

నాగార్జున నటించి వచ్చే వారం విడుదల కాబోతున్న వైల్డ్ డాగ్, ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో నాగార్జున నటించబోయే సినిమాలు రొమాంటిక్ సినిమాలు కావనే సంగతి తెలిసిందే.అయితే నాగార్జున నిర్ణయం పట్ల ఆయన ఫ్యాన్స్ మాత్రం నిరుత్సాహంతో ఉన్నారు.

అయితే వరుసగా నాగార్జున యాక్షన్ సినిమాలలో నటిస్తే ఫ్యామిలీ ఆడియన్స్ కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.మన్మథుడు2 సినిమా ఫ్లాప్ కావడం వల్లే నాగార్జున ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుండటం గమనార్హం.అభిమానుల కోసం నాగార్జున నిర్ణయం మార్చుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఈ మధ్య కాలంలో నాగ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన సోగ్గాడే చిన్నినాయన సినిమాలో నాగార్జున బంగార్రాజు పాత్రలో రొమాంటిక్ గా చేయడం వల్లే ఆ పాత్ర హిట్టైందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరి అభిమానుల కోసం నాగార్జున ఇకపై రొమాంటిక్ సినిమాల్లో కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారేమో చూడాల్సి ఉంది.మరోవైపు నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమాపై ప్రేక్షకుల్లో బాగానే అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాతో నాగార్జున మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube