లోక్సభ ఎన్నికలు( Lok Sabha elections ) సమీపిస్తున్న తరుణంలో బీజేపీ అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తోంది.ఇప్పటికే మొదటి జాబితాను విడుదల చేసిన పార్టీ అధిష్టానం ఇవాళ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది.
ఈ నెల 11న అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసిన సంగతి తెలిసిందే.సుమారు వంద మంది పేర్లతో ఈ లిస్ట్ విడుదల కానుందని తెలుస్తోంది.
తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, గుజరాత్, బీహార్, ఢిల్లీ, హర్యానా మరియు ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసింది.గెలుపు అవకాశాలు, సామాజిక సమీకరణాలు, సర్వేలు మరియు కొత్తగా పార్టీలో చేరిన ప్రముఖుల ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక ఉండనుంది.
కాగా తెలంగాణలోని ఏడు స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తి అయిందని సమాచారం.