BJP : నేడు బీజేపీ లోక్‎సభ అభ్యర్థుల రెండో జాబితా..!!

లోక్‎సభ ఎన్నికలు( Lok Sabha Elections ) సమీపిస్తున్న తరుణంలో బీజేపీ అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తోంది.

ఇప్పటికే మొదటి జాబితాను విడుదల చేసిన పార్టీ అధిష్టానం ఇవాళ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది.

ఈ నెల 11న అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసిన సంగతి తెలిసిందే.

సుమారు వంద మంది పేర్లతో ఈ లిస్ట్ విడుదల కానుందని తెలుస్తోంది.తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, గుజరాత్, బీహార్, ఢిల్లీ, హర్యానా మరియు ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో లోక్‎సభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసింది.

గెలుపు అవకాశాలు, సామాజిక సమీకరణాలు, సర్వేలు మరియు కొత్తగా పార్టీలో చేరిన ప్రముఖుల ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక ఉండనుంది.

కాగా తెలంగాణలోని ఏడు స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తి అయిందని సమాచారం.