సమంతకు నా అవసరం లేదు.. చిన్మయి కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీకి ఏ మాయ చేసావే సినిమా ద్వారా పరిచయమయ్యారు నటి సమంత. ఈ సినిమాలో సమంత పాత్రకు ఎంత గుర్తింపు తెచ్చిందో ఆమెకు డబ్బింగ్ చెప్పిన చిన్మయికి కూడా అంతే గుర్తింపు తీసుకువచ్చింది.

 Samantha Doesnt Need Me Chinmayi Comments Viral Details, Samantha ,chinmai,dubbi-TeluguStop.com

ఈ సినిమాలో సమంత పాత్రకు డబ్బింగ్ చెప్పినటువంటి సింగర్ చిన్మయి కూడా అదే స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది.సమంతకు చిన్మయి వాయిస్ ఎంతో అద్భుతంగా సెట్ అవ్వడంతో సమంత చేసిన పలు సినిమాలకు చిన్మయి డబ్బింగ్ చెప్పారు.

ఈ విధంగా సమంతతో పాటు చిన్మయి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఈ విధంగా సమంత సినిమాలకు చిన్మయి డబ్బింగ్ చెప్పడంతో వీరిద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఏర్పడి ఇద్దరు స్నేహితులుగా మారిపోయారు.

మీటూ ఉద్యమంలో చిన్మయికి సమంత పూర్తి మద్దతు తెలుపగా ఈ ఫ్యామిలీ మెన్2 వెబ్ సిరీస్, సమంత విడాకుల ప్రకటన సమయంలో ఆమెపై వచ్చిన విమర్శల విషయంలో కూడా చిన్మయి సమంతకు మద్దతుగా నిలబడింది.ఈ విధంగా వీరిద్దరూ ఎంతో మంచి స్నేహితులుగా మారిపోయారు.

అయితే తాజాగా సమంత గురించి చిన్మయి చేసిన కొన్ని కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Telugu Chinmai, Web, Samantha, Chinmayi-Movie

ఈ మధ్యకాలంలో సమంత నటిస్తున్న సినిమాలకు ఆమె డబ్బింగ్ చెప్పుకోవడంతో చిన్మయి సహాయం అవసరం లేకుండా పోయింది.ఈ క్రమంలోనే ఈ విషయంపై చిన్మయి స్పందిస్తూ ఇకపై సమంతకు నా అవసరం ఉండదని అనుకుంటున్నాను.సమంతతో నా జర్నీ ముగిసిందనే భావిస్తున్న అంటూ తెలియచేశారు.

అయితే సమంత తాను ఇద్దరు కలిసి కనిపించకపోవడంతో చాలామంది మా ఇద్దరి మధ్య మనస్పర్ధలు వస్తున్నాయని భావించారు.కలిసి కనిపించకపోవడంతోనే విమర్శలు వస్తున్నాయి అనుకోవడం సరైనది కాదు.

మేము కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల ఎలాంటి లాభం లేదని,ఒకవేళ మేము కలవాలి అనుకుంటే ఇంట్లోనే కలుస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తుంటామని ఈ సందర్భంగా ఈమె చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube