రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్‌తో కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ సమావేశం అయ్యారు.త్వరలో జరగనున్న ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల వ్యవహారంపై చర్చించేందుకు భేటీ అయ్యారని తెలుస్తోంది.
ఇరువురు అధ్యక్ష బరిలో ఉన్న నేపథ్యంలో.పార్టీ భవిష్యత్ పై చర్చించారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
అయితే, అధ్యక్ష బరిలో తాను లేనని, రాహుల్ గాంధీనే పదవి స్వీకరించేలా ఒప్పించేందుకు ప్రయత్నిస్తామని గెహ్లూత్ ఇదివరకే స్పష్టం చేశారు.మరోవైపు, ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాతే అధ్యక్ష పోటీలో ఉండేది లేనిది నిర్ణయిస్తానని శశిథరూర్ పేర్కొన్నారు.







