ఫ్యామిలీ మ్యాన్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న సామ్ !

అక్కినేని కోడలు సమంత అంటే తెలియని వారు ఉండరేమో తన నటనతో, అభినయంతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది.స్టార్ హీరోయిన్ గా ఎదిగి టాలీవుడ్ స్టార్ హీరోలందరితో ఆడి పాడింది.

 Samantha Akkineni Enjoys Family Man Success, Samantha Akkineni, Family Man 2, So-TeluguStop.com

స్టార్ స్టేటస్ అనుభవిస్తూనే నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని మ్యారేజ్ లైఫ్ కూడా ఎంజాయ్ చేస్తుంది.అయితే సమంత పెళ్ళికి ముందులాగా సినిమాలు చేయడం లేదు.

నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు మాత్రమే చేస్తూ హిట్స్ కొడుతోంది.ఇప్పుడిప్పుడే హీరో , హీరోయిన్స్ ఓటిటీ వైపు అడుగులు వేస్తున్నారు.సమంత కూడా ఈ మధ్యనే డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లోకి అడుగు పెట్టింది. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ లో సమంత కీలక పాత్రలో నటించింది.

ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యి సూపర్ హిట్ అయినా విషయం తెలిసిందే.

-Movie

ఇందులో మనోజ్ బాజ్పాయ్ ప్రధాన పాత్రలో నటించారు.ఇందులో సమంత కూడా ముఖ్య పాత్రలో నటించడంతో సౌత్ లో కూడా ఈ వెబ్ సిరీస్ పై భారీ అంచనాలు ఉన్నాయి.ఈ వెబ్ సిరీస్ కు తమిళ టైగెర్స్ నుండి నిరసనలు ఎదురవుతున్న ఈ సిరీస్ మాత్రం సూపర్ సక్సెస్ అయ్యింది.

ఈ వెబ్ సిరీస్ ను బ్యాన్ చెయ్యాలంటూ నిరసనలు చేస్తుంటే ప్రజలు ఈ వెబ్ సిరీస్ చూడడానికి మరింత ఆసక్తి చూపిస్తున్నారు.

-Movie

ఈ కారణం కూడా ఈ సిరీస్ సూపర్ హిట్ అవ్వడానికి ఒక కారణం.సమంత నటనకు ప్రశంసలు అందుతున్నాయి.సమంత ఈ సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేస్తుంది.

తాజాగా షేర్ చేసిన ఫొటోలో తాను ఎంత ఎంజాయ్ చేస్తుందో చెప్పకనే చెబుతుంది.ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆమె మామిడి చెట్టు పక్కన ఒక ఫామ్ హౌస్ గట్టు మీద కూర్చుని ఎంతో ఆనందంగా కనిపిస్తుంది.

ఇక ఆ ఫొటోలో మామిడి చెట్టు ఆకులతో మామిడి కాయతో కవర్ చేస్తూ తీసిన ఆమె ఫోటో చూపరులను ఆకట్టుకుంటుంది.

ఆ ఫొటోలో సమంత నవ్వుకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.మొత్తానికి మొదటి వెబ్ సిరీస్ తోనే సూపర్ హిట్ సాధించి ఆ సక్సెస్ ను ఇలా ఎంజాయ్ చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube