‘బాహుబలి’ చిత్రం తర్వాత ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగి పోయింది.బాహుబలి రెండు పార్ట్‌లతో ప్రభాస్ ఇండియాస్ న్యూ సూపర్ స్టార్‌గా మారిపోయాడు.
అంతటి క్రేజ్ తెచ్చుకున్న తర్వాత ఒక సాదా సీదా సినిమా చేస్తే ఏం బాగుంటుందనే ఉద్దేశ్యంతో ప్రభాస్ 350 కోట్ల రూపాయలతో బాహుబలిని మించే స్థాయిలో ‘సాహో’ను చేయడం జరిగింది.సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఒక హాలీవుడ్ రేంజ్‌లో ఉంటుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.మరి ఈ చిత్రం ఎలా ఉందనే విషయం ఈ రివ్యూలో చూద్దామా.
కథ :
ఒక భారీ సంపదను దక్కించుకునేందుకు పలువురు విలన్స్ ప్రయత్నిస్తూ ఉంటారు.ఒకరిని ఒకరు నమ్మకుండా ఎవరి ప్రయత్నాలు వారే చేస్తూ ఆ సంపదను కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తారు.ఆ సంపదకు విలన్స్‌కు మద్య నిలిచే వ్యక్తి అశోక్(ప్రభాస్).ఇంతకు అశోక్ దొంగనా, పోలీసా అనే విషయాన్ని సినిమా చూసి తెలుసుకోండి.కథలో చాలా చాలా ట్విస్ట్‌లు ఉన్నాయి.
ఎంతగా అంటే బాబోయ్ అనుకుని జుట్టు పీక్కునేంతగా ఉన్నాయి.
నటీనటుల నటన :
బాహుబలి సినిమాలో తన అద్బుత నటనతో మెప్పించిన ప్రభాస్ మరోసారి ఈ చిత్రంలో కూడా దుమ్ము రేపాడు.సిక్స్ ప్యాక్ బాడీతో యాక్షన్ హీరోగా ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ అదిరింది.ప్రభాస్ యాక్షన్ సీన్స్‌లో చూపించిన ప్రతిభకు అంతా ముగ్దులు అవ్వాల్సిందే.హీరోయిన్‌తో రొమాన్స్ విషయంలో కాస్త తడబడ్డాడు.ఇక పాటల్లో డాన్స్‌లు కూడా మాంచి గ్రేస్‌తో వేసినట్లుగా అనిపించలేదు.
ఇక కొన్ని క్లోజప్ షాట్స్‌లో కూడా ఎనర్జి లేనట్లుగా నటించాడు.మొత్తంగా చూస్తే సాహోలో స్టార్స్ ఎంతో మంది ఉన్నా ప్రభాస్ వన్ మన్ ఆర్మీలా సాగించాడు.
పోలీస్ ఆఫీసర్‌గా శ్రద్దా కపూర్ మంచి నటనతో ఆకట్టుకుంది.సినిమాలో ఆమె కనిపించిన ప్రతి సీన్‌లో కూడా కలర్ నిండినట్లుగా అనిపించింది.ప్రభాస్‌తో ఈమె రొమాన్స్ బాగానే పండించేందుకు ప్రయత్నించింది.తన గ్లామర్‌తో యాక్షన్‌కు ఈమె అందాలను జత కలిపి హీట్ ఎక్కించారు.ఇక వెన్నెల కిషోర్ ఉన్నది కొద్ది సమయమే అయినా ఆకట్టుకున్నాడు.ఇక నిల్ నితిన్ ముఖేష్ మరియు జాకీ ష్రాఫ్‌లు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు.
మురళి శర్మ మరియు అరుణ్ విజయ్‌ల పాత్రలు పరిమితంగా ఉన్నాయి.ఇంకా ఇతర నటీనటులు వారి పాత్రల పరిధిలో వారి పాత్రలకు పూర్తి న్యాయం చేసే విధంగా నటించారు.
టెక్నికల్ :
సినిమా విడుదలకు ముందే ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాటలు సో సోగానే అనిపించాయి.సినిమాలో చూస్తే మాత్రం వాటి చిత్రీకరణ చాలా బాగుంది.
భారీ సెంట్టింగ్స్ మరియు అందమైన లొకేషన్స్‌లో పాటల చిత్రీకరణ చేశారు.ఆ పాటల ట్యూన్స్ కూడా బాగుంటే ఇంకా బాగుండేది.
ఇక పాటల విషయం పక్కన పెడితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగా వచ్చింది.ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల సమయంలో, చేజింగ్ సన్నివేశాల సమయంలో వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకుల కుర్చి అంచున కూర్చోబెడుతుంది.
ఇక సినిమాటోగ్రఫీ పనితనం గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది.ఎడిటింగ్‌లో కొన్ని సీన్స్‌ను ఇంకాస్త కట్ చేయాల్సి ఉంది.
ఆ సీన్స్ కాస్త స్క్రీన్‌ప్లేను బోరింగ్ చేశాయి.దర్శకుడి అనుభవ రాహిత్యం క్లీయర్‌గా కనిపిస్తోంది.నిర్మాణాత్మక విలువల గురించి అసలు మాట్లాడనక్కర్లేదు.350 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందిన విషయం తెల్సిందే.అయితే ఎందుకు ఇంత బడ్జెట్ ఈ చిత్రంకు అయ్యిందో అర్థం కాని పరిస్థితి.
విశ్లేషణ :
బాహుబలి సినిమా తర్వాత ఒక మంచి సినిమా అది కూడా భారీ సినిమా తీయాలనుకున్న ప్రభాస్ సాహస నిర్ణయాన్ని అభినందించాలి.ఎందుకంటే బాహుబలి చిత్రం కోసం నాలుగు సంవత్సరాలు కేటాయించి ఆ వెంటనే మరో భారీ ప్రాజెక్ట్‌కు కమిట్ అవ్వడం అంటే చాలా గొప్ప నిర్ణయం.ఎందుకంటే సాహో వంటి భారీ చిత్రం ఖచ్చితంగా రెండేళ్లు పడుతుందని ఆయనకు మొదటే తెలిసి ఉండాలి.
అయినా కూడా మంచి సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో సాహోను ఎంచుకున్నాడు.అద్బుతమైన యాక్షన్ సీన్స్ కోసం ప్రభాస్ పడ్డ కష్టం క్లీయర్‌గా కనిపిస్తుంది.యాక్షన్ సీన్స్ సహజంగా వచ్చేందుకు ప్రభాస్ చాలా కష్టపడ్డాడు.అవి గ్రాఫిక్స్‌లో మేనేజ్ చేయడం పెద్ద కష్టం ఏమీ కాదు.
కాని ప్రతిది కూడా సహజంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రం కోసం ప్రభాస్ చాలా ఇబ్బందుల పడ్డాడు.ఎన్ని పడ్డా కూడా సాహో చిత్రంలోని తన పాత్రకు పూర్తి న్యాయం చేసేందుకు ప్రయత్నించాడు.
సినిమా మొత్తంను తన భుజాలపై వేసుకుని నడిపిస్తున్నాడు.సినిమా కథ మరియు కథనం విషయంలో దర్శకుడు సుజీత్ ఇంకా వర్క్ చేయాలనిపించింది.
స్క్రిప్ట్‌ను మరీ ఎక్కువ రోజులు రుద్దడం వల్ల లోపాలు జరిగినట్లుగా అనిపిస్తుంది.ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ప్రేక్షకులకు ఈ చిత్రం కాస్త నిరాశ మిగిల్చిందని చెప్పక తప్పదు.
తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం అంతగా ఎ్కదనిపిస్తుంది.కాని యాక్షన్ సినిమాలను ఇష్టపడే బాలీవుడ్ ప్రేక్షకులకు సాహో నచ్చవచ్చు అనిపిస్తుంది.
ప్లస్‌పాయింట్స్ :
కొన్ని యాక్షన్ సీన్స్, ప్రభాస్, శ్రద్దా కపూర్
మైనస్ పాయింట్స్ :
కథ, ట్విస్ట్‌లు మరీ ఎక్కువ అయ్యాయి,ఓవర్ యాక్షన్ సీన్స్
రేటింగ్ : 2.75/5.0
బోటం లైన్ :’బాహుబలి’కి చాలా దూరంలో నిలిచిన ‘సాహో’
.