రేషన్ డీలర్ల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల

నల్లగొండ జిల్లా: పదో తరగతి పాసైన యువతీ యువకులు ఆయా గ్రామాల్లో ప్రకటించిన రిజర్వేషన్స్ అనుసరించి రేషన్ డీలర్ పోస్ట్ కి దరఖాస్తు చేసుకోవచ్చని నల్లగొండ రెవిన్యూ డివిజన్ అధికారి రవి ఒక ప్రకటనలో తెలిపారు.

డివిజన్ పరిధిలో మొత్తం 20 గ్రామాల్లో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ల పోస్టుల భర్తీకి శనివారం నోటిఫికేషన్ జారీ చేశామన్నారు.

చిట్యాల మండలంలో వట్టిమర్తి, తాళ్ళవెల్లెంల,వేంబాయి, కనగల్ మండలంలో తుర్కపల్లి,లచ్చుగూడెం, కట్టంగూర్ మండలంలో ఈదులూరు,నారగూడెం, పామనుగుండ్ల,యరసానిగూడెం,కేతేపల్లి మండలంలో ఇనుపాముల,నకిరేకల్ మండలంలో చందుపట్ల, తాటికల్,నల్గొండ మండలంలో పానగల్,నార్కెట్ పల్లి మండలంలో చెరువుగట్టు, శాలిగౌరారం మండలంలో అంబారిపేట,ఊట్కూరు, ఉప్పలంచ, తిప్పర్తి మండలంలో అనిశెట్టి దుప్పలపల్లి, రామలింగాలగూడెం,రాజుపేట గ్రామాల్లో ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్ లో తెలిపారు.ఆసక్తి కలిగిన వారు రిజర్వేషన్ల వారీగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Release Of Notification For Appointment Of Ration Dealers, Notification , Ratio

ఈ పోస్టులకు ధరఖాస్తు చేసుకునే వారు సంబంధిత గ్రామంలో నివసించేవారై వుండాలి.అలాగే పదో తరగతిలో ఉత్తీర్ణత పొంది వుండాలి.

వయస్సు 18 నుండి 40 ఏండ్ల మధ్య వుండాలి.ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏ ఇతర వ్యాపారాలు లేని వారై ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు.

Advertisement

దరఖాస్తు చేసుకున్న వారందరికీ జనవరి 12 న నల్గొండలోని ఆర్డీవో కార్యాలయంలో రాత పరీక్ష నిర్వహిస్తారని,మెరిట్ సాధించిన వారిని ఎంపిక చేయనున్నట్లు ఆర్డీవో తెలిపారు.

Advertisement

Latest Nalgonda News