గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుద‌ల

నల్లగొండ జిల్లా: తెలంగాణ‌లో ఎస్సీ,ఎస్టీ,బీసీ గురుకులాల్లోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ప్ర‌భుత్వం నోటిఫికేషన్‌ విడుద‌ల చేసింది.2024-25 విద్యా సంవత్సరంలో డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లకు టీఎస్‌ఆర్‌డీసీ సెట్‌-2024ను ఏప్రిల్‌ 28న నిర్వహించనున్నట్టు ఆయా విద్యాసంస్థలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి.

ప్రవేశ పరీక్ష కోసం ఏప్రిల్‌ 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పూర్తయిన విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్‌ టికెట్లు ఏప్రిల్‌ 21 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు.

దరఖాస్తు సహా ఇతర వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు పూర్తి ఉచితంగా విద్య,భోజన వసతి తోపాటు యూనిఫామ్‌, పుస్తకాలు,నోట్‌ బుక్స్‌ సహా పలు సదుపాయాలను కల్పించనున్నట్టు తెలిపారు.

ప్రస్తుతం బీసీ గురుకులం పరిధిలో 15 బాలుర,15 మహిళా డిగ్రీ కళాశాలలు,ఎస్సీ గురుకులంలో 26 మహిళా కాలేజీలు,ఎస్టీ గురుకులంలో 6 బాలుర,15 మహిళా కళాశాలలున్నాయి.ఈ కాలేజీల్లో బీఏ,బీకామ్‌, బీఎస్సీ,బీబీఏ,బీహెచ్‌ఎసీటీ, బీఎఫ్‌టీ సహా వివిధ కోర్సులు అందుబాటులో ఉండగా ప్రతి కోర్సులో 40 సీట్లున్నాయి.

Advertisement
My Empire : Reseña Y Reputación Del Sitio Para Jugadores E...

Latest Nalgonda News