ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. ఇకపై కస్టమర్ల ఫిర్యాదులు ఎక్కువైతే బ్యాంకులకు బాదుడే..!

ప్రస్తుతం డిజిటల్ రంగం మహిమ అంటూ ప్రపంచంలో నలుమూలల డిజిటల్ వ్యాలెట్ సహాయంతో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయడం ఎక్కువగా మారింది.ఒకవైపు డిజిటల్ రంగం అభివృద్ధి చెందింది అని చెప్పి సంతోషించాలో మరోవైపు డిజిటల్ వల్ల మరెన్నో ఇబ్బందులకు గురవుతున్నామని బాధపడాలో అర్థం కాని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు.

 Rbi Key Decision On Banks Customer Charges, Customer Charges, Online Transfers,-TeluguStop.com

దీనికి కారణం ప్రస్తుతం బ్యాంకులు కస్టమర్లకు అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నాయని చెప్పవచ్చు.ఒక్కోసారి ఆన్లైన్ లో ఏదో ఒక నగదు రహిత యాప్ నుండి ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు అవి కాస్త ఫెయిల్ అయిన కస్టమర్లు రోజుల తరబడి ఆ డబ్బుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే వారు చేసేదేమిలేక డబ్బులు మళ్ళీ ఎప్పుడు రీఫండ్ అవుతాయో అంటూ ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది.మరోవైపు ప్రతి విషయంలో డిజిటల్ సేవలు ఉండటంలో దాంతో తప్పనిసరిగా కచ్చితంగా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ సంబంధించిన సేవలను ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇలాంటి పరిస్థితులను ఇప్పటి వరకు బ్యాంకులు చాలా చిన్న చూపు చూశాయి.ఇలాంటి విషయాలకు సంబంధించి బ్యాంకు అయితే కస్టమర్లను బ్యాంకు అధికారులు అంత సులువుగా పట్టించుకునేవారు కాదు.

అయితే ఇకపై పరిస్థితి అలా ఉండదని తెలుస్తోంది.

ఇందుకు కారణం తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ కీలక నిర్ణయం తీసుకోవడంతో ఇకపై ప్రవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులకు చుక్కలు చూపించే అవకాశం ఏర్పడింది.

కొత్త రూల్స్ ను జనవరి మొదటివారం నుంచి ప్రవేశపెట్టబోతోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.నిజానికి బ్యాంకింగ్ రంగంలో ఏ ఒక్క బ్యాంకు నుంచి అయినా సరే కస్టమర్ బ్యాంకు అంబుడ్స్‌మ‌న్‌ కు ఇచ్చే కంప్లైంట్ కు పరిష్కరించడానికి ఏకంగా 3145 రూపాయలు ఖర్చు అవుతున్నట్లు ఆర్బిఐ పేర్కొంది.

ఇకపై జనవరి నెల నుండి ఏ బ్యాంకుకు సంబంధించిన బ్యాంక్ అంబుడ్స్‌మ‌న్‌ కు సంబంధించి కంప్లైంట్ వస్తే అందుకు సంబంధించిన ఖర్చు మొత్తం ఆ బ్యాంకు మాత్రమే చెల్లించాలంటూ రూల్స్ తీసుకువచ్చింది.

ఇక ఇందుకు సంబంధించి సమస్య పరిష్కారం కోసం అయ్యే ఖర్చు అన్నిటిని సదరు బ్యాంక్ నుండే ఆర్బిఐ కలెక్ట్ చేయబోతోంది.

దీనికి ఒకటే ఒక పరిష్కారంగా ఫిర్యాదులు రాకుండా సేవలను అందించగలరు అని ఆర్బిఐ పేర్కొంది.ప్రస్తుతం రోజుకు కొన్ని కోట్ల ట్రాన్సాక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో కస్టమర్లు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండేందుకు ఆర్బిఐ నిర్ణయం తీసుకుంది.

ఇదివరకు ఓ ప్రైవేటు బ్యాంకులో అలాగే తాజాగా ఎస్బిఐ బ్యాంకులో కూడా యూపీఐ ట్రాన్సాక్షన్ లాంటి సమస్యలను విపరీతంగా ఎదుర్కొంటున్నాయి.ఒకవేళ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం అతి త్వరలో అమలు అయితే బ్యాంకింగ్ సేవలను పొందే కస్టమర్లు నాణ్యమైన సేవలను సులువుగా పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube