'చివరికి రష్మీ సుధీర్ కే దక్కేనా.?' అంటే సహజీవనం చేయొచ్చు అని రష్మీ ఎలా కౌంటర్ ఇచ్చిందో చూడండి!

సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేసి సరైన ఛాన్సులు రాక బుల్లితెరవైపు వచ్చినవారెందరో.వారిలో ఒకరే రష్మి.

తెలుగు టెలివిజన్ రంగంలో యాంకర్ గా దూసుకుపోతున్న రష్మి.ఒకప్పుడు సినిమా ఛాన్సుల కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు.

చిన్న చిన్న పాత్రలు చేసి సరైన అవకాశాలు రాక జబర్దస్త్ యాంకర్ గా సెటిల్ అయిపోయింది.యాంకరింగ్ కి గ్లామర్ సొగసులద్దిన వారిలో అనసూయ,రష్మి ముందుంటారు.

రష్మి ఏం చేసినా,ఏం మాట్లాడిన స్ట్రెయిట్ ఫార్వార్డ్ గా ఉంటుంది.రష్మీ, సుధీర్ మధ్య ఏదో కెమిస్ట్రీ నడుస్తుంది అని ఎప్పటినుండో తెలుగు ఆడియన్స్ లో టాక్.

Advertisement

వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బెస్ట్ కపుల్ అవుతారు అని చాలా మంది ఫాన్స్ కూడా కామెంట్స్ చేస్తూ ఉంటారు.మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని, వృత్తి పరంగా క్లోజ్‌గా ఉంటాం తప్ప, తమ మధ్య అలాంటిదేమీ లేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో రష్మీ వెల్లడించారు.

ఇప్పుడు ట్విట్టర్ లో ఓ అభిమాని సుధీర్ గురించి అడిగితె తన స్టైల్ లో స్పందించారు.సుధీర్‌ను ఎందుకు అంతలా హేట్ చేస్తున్నారు? అనే ప్రశ్నకు బదులిస్తూ.‘అలాంటి వారిని నేనుప్పుడూ అసహించుకోను.

ఎందుకంటే వారు నన్ను మహారాణిలా ట్రీట్ చేస్తారు’ అని తెలిపారు.ఎలాంటి ప్రశ్నలు మీకు చికాకు తెప్పిస్తాయి? అనే ప్రశ్నకు రష్మి రియాక్ట్ అవుతూ….‘పెళ్లికి సంబంధించిన, ఏజ్ రిలేటెడ్ ప్రశ్నలకు సమాధానం చెప్పడం నాకు నచ్చదు’ అన్నారు.

రష్మి ఎవరి కోసం వెయిట్ చేస్తుందో… చివరకు సుధీర్‌కే దక్కుతుందేమో? అనే అభిమాని కామెంటుకు ”చాలా రోజుల క్రితమే నా వెయింటింగ్ ముగిసింది.నా ప్రైవేట్ లైఫ్ ప్రైవేట్ గానే ఉంచాలనుకుంటున్నాను” అని తెలిపారు.సుధీర్, ప్రదీప్ ఇద్దరిలో ఒకరిని పెళ్లి చేసుకునే అవకాశం వస్తే ఎవరిని ఎంచుకుంటారు? అనే ప్రశ్నకు ‘నా వర్క్ లైఫ్, పర్సనల్ లైఫ్… వేర్వేరుగా ఉంటాయి.అందులో ఉండే వ్యక్తులు ఇందులోకి, ఇందులో ఉండే వ్యక్తులు అందులోకి రావడం జరుగదు’ అని రష్మి అన్నారు.

నేను నటిగా ఎదగడానికి ఆ సినిమానే కారణం.. కృతిసనన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
వైట్ హెయిర్ తో వర్రీ వద్దు.. ఈ హెర్బల్ ఆయిల్ మీకోసమే!

లవ్ మ్యారేజ్….అరేంజ్డ్ మ్యారేజ్ వీటిలో దేన్ని ఎంచుకుంటారు అనే ప్రశ్నకు రష్మి రియాక్ట్ అవుతూ….

Advertisement

‘సహజీవనం’ అనే మరో ఆప్షన్ కూడా ఉంది అంటూ దిమ్మదిరిగే సమాధానం ఇచ్చారు.

తాజా వార్తలు