కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ( Rajinikanth ) తాజాగా జైలర్ సినిమా( Jailer Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు.ఈ సినిమా దాదాపు 700 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించింది ఈ సినిమా తర్వాత రజనీకాంత్ తదుపరి సినిమాలపై అందరిలోనూ భారీ స్థాయిలోనే అంచనాలు ఏర్పడ్డాయి.
ప్రస్తుతం రజనీకాంత్ తన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో వస్తున్నటువంటి లాల్ సలామ్ అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.ఈ సినిమా తర్వాత రజనీకాంత్ తన తదుపరి 170 వ చిత్రం గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

లైకా ప్రొడక్షన్ బ్యానర్ లో ఇప్పటికే మూడు సినిమాలను చేసినటువంటి రజనీకాంత్ నాలుగో సినిమాకు కూడా కమిట్ అయ్యారు అని తెలుస్తుంది ఈ సినిమాకు టీజే జ్ఞానవేల్ ( TJ Gnanavel ) ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారు దీంతో ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి సూర్య నటించిన జై భీమ్ తర్వాత ఈయన దర్శకత్వం వహిస్తున్నటువంటి సినిమా కావడంతో ఈ సినిమా పట్ల భారీ స్థాయిలోనే అంచనాలు ఉన్నాయి ఇక ఈ సినిమాలో మరొక టాలీవుడ్ హీరో బాగం అవుతున్నారన్న వార్తలుగా వస్తున్నాయి అయితే తాజాగా ఈ వార్తలపై మేకర్స్ అధికారికంగా ప్రకటన విడుదల చేశారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ 170 వ సినిమాలో టాలీవుడ్ నటుడు రానా( Rana )దగ్గుబాటి బాగమవుతున్నారు అనే విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి ఇక రానాతో పాటు మరో ముగ్గురు హీరోయిన్స్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు అంటూ ఈ సందర్భంగా మేకర్స్ అధికారిక ప్రక్కన విడుదల చేశారు.మరి రజనీకాంత్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసినటువంటి ఆ హీరోయిన్స్ ఎవరో అనే విషయానికి… రితికా సింగ్ ( Ritika Singh ), మంజు వారియర్ ( Manju Warrier ), దుషార విజయన్ ( Dushara Vijayan ) నటిస్తున్నారు.ఇలా ఈ ముగ్గురు హీరోయిన్ల గురించి అలాగే రానా గురించి మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు ఇక ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ ( Anirudh Ravichandran )సంగీతం అందించనున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి.