శివరాజ్ కుమార్( Shivaraj kumar ) హీరోగా తెరకెక్కిన ఘోస్ట్ మూవీ( Ghost’ ) ఈ నెల 19వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హిట్టవుతుందని చెప్పలేం కానీ కన్నడలో మాత్రం ఈ సినిమా సంచలనాలు సృష్టించే అవకాశాలు ఉన్నాయి.
కొన్నిరోజుల క్రితం పవన్, మహేష్, ఎన్టీఆర్ గొప్పదనం గురించి చెప్పిన శివరాజ్ కుమార్ తాజాగా చిరంజీవి గొప్పదనం గురించి కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
చిరంజీవితో ఉన్న అనుబంధం గురించి చెప్పాలని అభిమానులు కోరడంతో శివరాజ్ కుమార్ ఆసక్తికర కామెంట్లు చేశారు.
లెజెండ్ ఎప్పటికీ లెజెండ్ గానే ఉంటారని ఆయన అన్నారు.చిరంజీవి గారి దగ్గర చాలా నేర్చుకున్నానని శివరాజ్ కుమార్ కామెంట్లు చేశారు.
చిరంజీవి నా విషయంలో కనబరిచిన ప్రేమ, గౌరవాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని శివరాజ్ కుమార్ చెప్పుకొచ్చారు.చిరంజీవితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ శివరాజ్ కుమార్ ఈ కామెంట్లు చేశారు.

శివరాజ్ కుమార్ చిరంజీవి గొప్పదనం గురించి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.బాలయ్య శివరాజ్ కుమార్ కాంబినేషన్ లో రాబోయే రోజుల్లో ఒక సినిమా తెరకెక్కనుండగా చిరంజీవి శివరాజ్ కుమార్ కాంబినేషన్ లో సైతం సినిమా వస్తే బాగుంటుందని అభిమానుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది.

చిరంజీవి సినీ కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఖైదీ సినిమా( Khaidi ) ఒకటి కాగా 40 సంవత్సరాల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కనుందని ప్రచారం జరుగుతుండగా ఈ సీక్వెల్ కు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.చిరంజీవి సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.మెగాస్టార్ చిరంజీవి సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటంతో అభిమానులు ఎంతగానో సంతోషిస్తుండటం గమనార్హం.