ఆ పాత్రలలో తారక్ మాత్రమే నటించగలరు.. రాజమౌళి షాకింగ్ కామెంట్స్?

రాజమౌళి తారక్ కాంబినేషన్ అంటే బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే.ఈ కాంబినేషన్ లో నాలుగు సినిమాలు తెరకెక్కగా ఆ సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

 Rajamouli Shocking Comments On Ntr Roles Goes Viral In Social Media Details, Dir-TeluguStop.com

ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి తారక్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.ఫ్రీ టైమ్ లో ఏం చేస్తుంటారనే ప్రశ్నకు జక్కన్న స్పందిస్తూ సోది మాట్లాడుకుంటామని అన్నారు.

మా ఫ్యామిలీ తిండి గురించి ఎక్కువగా డిస్కస్ చేసుకుంటుందని రాజమౌళి తెలిపారు.ఎన్టీఆర్ కు రాజమౌళి బ్రేక్ ఇచ్చారనే కామెంట్ల గురించి జక్కన్న స్పందిస్తూ బ్రేక్ అని మాట్లాడటం సరైన పదం కాదని జక్కన్న చెప్పుకొచ్చారు.

సింహాద్రి కానీ యమదొంగ కానీ తారక్ మాత్రమే ఆ పాత్రలలో నటించగలడని మిగతా హీరోలు ఆ పాత్రలలో నటించినా ఆ పాత్రలకు న్యాయం చేయలేరని జక్కన్న చెప్పుకొచ్చారు.

నేను, తారక్ ఒకరికొకరు బ్రేక్ ఇచ్చుకున్నామని జక్కన్న వెల్లడించారు.

Telugu Rajamouli, Ntr, Ntr Rajamouli, Simhadri, Tarak, Tollywood, Yamadonga-Movi

నేను సినిమా చేస్తానని చెబితే తారక్ కథ కూడా అడగడని జక్కన్న కామెంట్లు చేశారు.నాపై జూనియర్ ఎన్టీఆర్ కు ఎంతో కాన్ఫిడెన్స్ ఉందని రాజమౌళి తెలిపారు.నేను తారక్ కోసం సీన్ రాసుకుంటే ఇష్టమొచ్చినట్టు రాసుకుంటా అని నేను ఎలాంటి సన్నివేశం రాసుకున్నా తారక్ పూర్తిస్థాయిలో న్యాయం చేస్తారని జక్కన్న చెప్పుకొచ్చారు.

Telugu Rajamouli, Ntr, Ntr Rajamouli, Simhadri, Tarak, Tollywood, Yamadonga-Movi

నేను చిన్న బడ్జెట్ సినిమాలు కూడా చేయగలనని అయితే వరుసగా పెద్ద సినిమాలు చేసి బోర్ డమ్ వస్తే చిన్న సినిమాలు చేస్తానని రాజమౌళి తెలిపారు.ఎన్నో పెద్ద సినిమాల తర్వాత చిన్న సినిమా చేయడం ఎగ్జైట్మెంట్ కు గురి చేస్తుందని రాజమౌళి తెలిపారు.నేను కంఫర్ట్ ఉన్న టెక్నీషియన్లకు ప్రాధాన్యత ఇస్తానని నా కుటుంబానికి చెందిన వాళ్లే టెక్నీషియన్లుగా ఉన్నారని రాజమౌళి కామెంట్లు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube