పేదల సంక్షేమం కోసమే ప్రజా పాలన:ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

నల్లగొండ జిల్లా:పేదల సంక్షేమ కోసమే ప్రజా పాలనని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి( Battula Lakshmareddy ) అన్నారు.

గురువారం వేములపల్లి మండల కేంద్రం,శెట్టిపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో వారి కార్యకర్తలకు మాత్రమే సంక్షేమ పథకాల అందించారని కాంగ్రెస్ ప్రభుత్వంలో పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల అందే విధంగా కృషి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ పుట్టల సునీత, కురుపయ్య,సర్పంచి చిర్ర మల్లయ్య,ఎంపిటిసి చలబాట్ల చైతన్య,పల్ల వీరయ్య,ఎంపీడీవో జానయ్య,నిర్మలదేవి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్టల కురుపయ్య,మాజీ సర్పంచ్ రేగటి రవీందర్ రెడ్డి,నాగవల్లి మధు,రావు ఎల్లారెడ్డి,గ్రామశాఖ,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు పుట్టల శ్రీను,పుట్టల పెద్ద వెంకన్న,దైదగిరి,హాజీ తదితరులు పాల్గొన్నారు.

Public Governance Is For The Welfare Of The Poor MLA Battula Lakshmareddy , Batt
పేదలకు సన్నబియ్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ : ఎమ్మెల్యే వేముల

Latest Nalgonda News