బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా మరో అరుదైన గుర్తింపు సొంతం అందుకుంది.యూనిసెఫ్ బాలల హక్కుల గుడ్‌విల్ అంబాసిడర్‌గా కొనసాగుతున్న ప్రియాంక ప్రపంచ దేశాలలో తన మానవీయ కార్యక్రమాలని కొనసాగిస్తుంది.
అనాధ పిల్లలకి అండగా నిలబడుతూ తన పెద్ద మనసు చాటుకుంటుంది.ఓ వైపు హీరోయిన్ గా హాలీవుడ్ రేంజ్ కి వెళ్ళిన ప్రియాంక తన వ్యక్తిత్వం, సేవా గుణాలతో తన విశేషంగా అభిమానులని సొంతం చేసుకుంది.
తాజాగా ఆమె మానవతా సేవలకు గాను డేనీ కాయే హ్యుమానిటేరియన్ అవార్డుని ప్రియాంక సొంతం చేసుకుంది.
న్యూయార్క్‌లో జరిగిన 15వ వార్షిక యూనిసెఫ్ స్నోఫ్లేక్ బాల్ కార్యక్రమంలో ప్రియాంక ఈ అవార్డు అందుకుంది.37 ఏళ్ల ప్రియాంక ఈ కార్యక్రమానికి తన తల్లితో కలిసి హాజరైంది.ఈ సందర్భంగా తన ఆనందాన్ని ప్రియాంకా చోప్రా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది బాలల తరపున గుడ్‌విల్ అంబాసిడర్‌గా సేవ చేయడం తనకు దక్కిన గొప్ప గౌరవమని ప్రియాంక పేర్కొంది.
ప్రియాంకా చేస్తున్న సేవలు, ఆమెకి వస్తున్నా గుర్తింపు చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ప్రియాంక భర్త నిక్కి జోనస్ ఆనందం వ్యక్తం చేసాడు.