ఆ విషయంలో డార్లింగ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ.. సలార్ మేకర్స్ ఇలా అయితే కష్టమే!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”సలార్”.ఈ భారీ బడ్జెట్ సినిమా రిలీజ్ కు సిద్ధం అయ్యింది.

 Prabhas Fans Disappointed With Salaar Makers, Salaar Movie , Prabhas, Pra-TeluguStop.com

ఎన్నో రోజుల ఫ్యాన్స్ ఎదురు చూపులు ఫలించే సమయం ఆసన్నం అయ్యింది.ఈ బ్లాక్ బస్టర్ సినిమా రిలీజ్ కు మరో 20 రోజుల సమయం మాత్రమే ఉంది.

క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 22న రిలీజ్ చేయనున్నారు.

కానీ ఇప్పటికి మేకర్స్ తీరు మాత్రం డార్లింగ్ ఫ్యాన్స్ కు నచ్చడం లేదట.

Telugu Hombale, Prabhas, Prabhasfans, Prashanth Neel, Salaar, Shruti Haasan, Tol

మేకర్స్ విషయంలో ఫ్యాన్స్ పూర్తిగా డిజప్పాయింట్ గా ఉన్నారని తెలుస్తుంది.ఎందుకంటే డిసెంబర్ 1న ట్రైలర్ రిలీజ్ అని చెప్పి కూడా చాలా రోజులే అవుతుంది.దీంతో ఈ ట్రైలర్ పై అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకున్నాయి.

కానీ ట్రైలర్ రిలీజ్ హడావిడి సోషల్ మీడియాలో కనిపించినంత మేకర్స్ లో లేదని అంటున్నారు ఫ్యాన్స్.ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త పోస్టర్స్ తో మరింత ఎంగేజ్ చేయాల్సిన మేకర్స్ ఇంత వరకు మరో కొత్త పోస్టర్ ను రిలీజ్ చేయకపోవడంపై తీవ్ర నిరాశలో ఉన్నారు.

సినిమాకు హైప్ ఇస్తున్న మేకర్స్ ప్రమోషనల్ కంటెంట్ విషయంలో సంబంధం లేనట్టు ప్రవర్తిస్తున్నారు.మరి ముందు ముందు అయినా అగ్రెసివ్ గా ప్రమోషన్స్ చేస్తారో లేదో చూడాలి.

Telugu Hombale, Prabhas, Prabhasfans, Prashanth Neel, Salaar, Shruti Haasan, Tol

కాగా ఈ సినిమాలో శృతి హాసన్( Shruti Haasan ) హీరోయిన్ గా నటిస్తుండగా.హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.అలాగే రవి బసృర్ సంగీతం అందించిన ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్, జగపతిబాబు కీ రోల్స్ పోషించారు.మరి ఇదైనా డార్లింగ్ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తుందో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube