మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ప్రారంభం

నల్లగొండ జిల్లా:తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు ( Lok Sabha elections )సమీపిస్తుం డడంతో ఎలక్షన్ కమిషన్ అధికారులు ఏర్పాట్లపై దృష్టి సారించి,ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇందులో భాగంగా మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించాలని యోచిస్తున్నారు.

సాధారణ పోలింగ్‌‌కు నాలుగు రోజుల ముందుగానే ఈ పక్రియను పూర్తి చేయాల్సి ఉండడంతో 8వ తేదీలోగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌ను పూర్తి చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.దీంతో ఈ దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు.

Postal Ballot Process Will Start From May 3 , Lok Sabha Elections, Election Comm

పోస్టల్ బ్యాలెట్ పత్రాల ముద్రణను నెల 30న మొదలు పెట్టి రెండో తేదీలోగా పూర్తి చేయాలని నిర్ణయించారు.ఎన్నికల సంఘం( Election Commission ) నిర్ణయించినట్టుగా పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలను ఆయా జిల్లాల్లోనే ముద్రించనున్నారు.కాగా ఈవీఎం యంత్రాలపై ఉంచే బ్యాలెట్‌ పత్రాలను హైదరాబాద్‌లోనే ముద్రించాలని అధికారులు నిర్ణయించారు.85 ఏళ్లు దాటిన వయోవృద్ధులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించు కునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.వృద్ధులతో పాటు ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది,కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఉద్యోగులు,దివ్యాంగులు కూడా పోస్టల్ బ్యాలెట్‌ను ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంటుంది.

ఇచ్చిన విషయం తెలిసిందే.ఈ అవకాశం ఎంచుకున్న దివ్యాంగులు,వయోవృద్ధులు మాత్రమే పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.

Advertisement

ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు రెండో దఫా శిక్షణ సందర్భంగా ఏర్పాటు చేసే ఫెసిలిటీ కేంద్రంలో ఓటు వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు.

సర్టిఫికెట్లు ఎన్నిసార్లైనా మీ సేవలో తీసుకోవచ్చు...!
Advertisement

Latest Nalgonda News