ఏపీలో ' ఓట్ల ' రాజకీయం ! రచ్చ రచ్చ చేస్తున్నారుగా

ఏపీ రాజకీయాల్లో కీలక  పరిణామాలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి.ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు కేవలం కొద్ది నెలలు మాత్రమే సమయం ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ ఒకరిపై ఒకరు పై చేయి సాధించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

 Politics Of 'votes' In Ap! Making Noise , Ap, Ap Cm Jagan , Ysrcp , Tdp ,-TeluguStop.com

నియోజకవర్గాల వారీగా తాము గెలిచే స్థానాలపైన లెక్కలు వేసుకుంటున్నారు.ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా ఏపీలో ఓట్ల రాజకీయం ఊపందుకుంది.

వైసిపి గెలుపు ధీమాతో ఉండగా,  టిడిపి జనసేన( TDP Janasena )లో తమ బలం పెరిగిందని,  వైసిపి ప్రభుత్వం పై వ్యతిరేకత గతంతో పోలిస్తే ఎక్కువైంది ని,  తమకే అవకాశం ఉంటుందనే నమ్ముకం తో ఉన్నాయి.ఇక గత కొద్దిరోజులుగా ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారం రచ్చ రచ్చ గా మారింది.

పొరుగు రాష్ట్రానికి చెందినవారికి ఏపీలో ఓట్లు ఉండడం , ఇప్పటికే చనిపోయిన వారికి కూడా ఓట్లు ఉన్నాయని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి.

Telugu Ap Cm Jagan, Ap, Ap Votes, Telugudesham, Ysrcp-Politics

దీనిపై వైసీపీ ప్రభుత్వం పై టిడిపి ఎన్నికల( TDP elections ) సంఘానికి ఫిర్యాదు చేసింది.అంతే కాదు ఫామ్ 7 ద్వారా ఓట్లను పునరుద్ధరించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.ఈ మేరకు టిడిపి నాయకులు ఇంటింటికి తిరుగుతూ ఓట్ల పరిశీలన చేపట్టారు.

ఒకే డోర్ నెంబర్ లో భారీ సంఖ్యలో ఓట్లు ఉండడాన్ని గుర్తించినట్లు టిడిపి నాయకులు పేర్కొంటున్నారు .అంతే కాదు టిడిపి సానుభూతిపరుల ఓట్లను తొలగించారని శ్రీకాకుళం లో నిరసన కూడా తెలియజేశారు.ఈ దొంగ కోట్ల వ్యవహారాన్ని ఒక ఉద్యమంగా చేపట్టాలని టిడిపి నిర్ణయించుకుంది.వచ్చే నెల 15 వరకు కొత్త ఓట్లకు అవకాశం ఉండడంతో , ఓటర్ల జాబితాలో మార్పు చేర్పులకు అవకాశం ఉండడంతో, టిడిపి నాయకులు ఇంటింటికి తిరుగుతూ ఓట్లు వ్యవహారం పై దృష్టి సారించారు .దీనిపై వైసీపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది .

Telugu Ap Cm Jagan, Ap, Ap Votes, Telugudesham, Ysrcp-Politics

అసలు దొంగ ఓట్ల వ్యవహారంలో  టిడిపి వైఖరిపై వైసిపి ( YCP )విమర్శలు చేస్తోంది.వైసిపి సానుభూతిపరుల ఓట్లను గుర్తించేందుకు ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి తొలగిస్తున్నారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.ఈ మేరకు వైసిపి బృందం రాష్ట్ర ఎన్నికల అధికారులను కలిసి టిడిపి నాయకులపై ఫిర్యాదు చేసి , వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది .ఈ క్రమంలో ఏపీలో ఓట్ల రాజకీయంపై అధికార ప్రతిపక్షాలు మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు, ప్రతి విమర్శలు ఎన్నో చోటుచేసుకుంటున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube