వచ్చే ఎన్నికల్లో ఏపీలో రాజకీయ పార్టీల మధ్య పోరు తీవ్రంగానే ఉంది.ఏ పార్టీ గెలుస్తుంది అనేది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉంది.
అయినా సరే ఎవరికి వారు గెలుపు ధీమాతోనే ఉన్నారు.వైసిపి ఒంటరిగా ఎన్నికలకు వెళుతుండగా, టిడిపి, జనసేన( TDP, Jana Sena ) లు పొత్తు పెట్టుకుని వైసీపీపై రాజకీయ దండయాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి, ఇక టికట్ల కేటాయింపు విషయంలో వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీ నేతలకు అంతు పట్టడం లేదు.
కొత్త ముఖాలను తెరపై తెస్తూ, పార్టీలో కీలకంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను సైతం తప్పిస్తున్నారు.గెలుపే ప్రామాణికంగా జగన్ ముందడుగు వేస్తున్నారు.175 స్థానాల్లోనూ గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేస్తూ.అభ్యర్థి ఎవరైనా తన పాలన చూసే జనాలు ఓట్లు వేస్తారనే నమ్మకంతోనే జగన్ ఉన్నారు.
అయితే జగన్( YS Jagan Mohan Reddy ) పాలనపై జనాల్లో ఏ అభిప్రాయం ఉందనేది ఎవరికి పెద్దగా క్లారిటీ రావడం లేదు.
వాస్తవంగా చూసుకుంటే పట్టణాల్లో వైసిపి( YCP ) పై కాస్త వ్యతిరేకత కనిపిస్తున్నట్లుగా అనేక సర్వేల్లో తేలింది.ముఖ్యంగా పట్టణాల్లో పెద్దగా అభివృద్ధి చోటు చేసుకోకపోవడం, వివిధ వర్గాల్లో నెలకొన్న అసంతృప్తి, ఇవన్నీ వైసీపీకి ఇబ్బందికరంగా మారాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఉద్యోగస్థుల్లోనూ కాస్త వ్యతిరేకత కనిపిస్తుంది.
సరైన సమయానికి జీతాలు రాకపోవడం, తమ ప్రయోజనాలు కూడా అందకపోవడం వంటివి అసంతృప్తి కలిగిస్తున్నాయట.తమ ప్రయోజనాల గురించి పట్టించుకోకుండా, పూర్తిగా సంక్షేమ పథకాలతో ఖజానా మొత్తం ఖాళీ చేస్తూ ఉండడం, ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ వచ్చిన దగ్గర నుంచి తమ అదనపుఆదాయం పూర్తిగా కోల్పోయామనే బాధ ఉద్యోగుల్లో ఉంది.
రేషన్ కార్డు నుంచి పించను, సంక్షేమ పథకాలకే లబ్ధిదారుల ఎంపిక వంటి వాటి విషయాల్లో తమ ప్రమేయం లేకుండానే వాలంటరీ వ్యవస్థ ద్వారా అన్ని ప్రజలకు అందడం వంటివి కూడా ప్రభుత్వ ఉద్యోగుల్లో అసంతృప్తిని కలిగిస్తున్నాయట.
ముఖ్యంగా పట్టణాల్లో రహదారులు మరమ్మతులకు గురైనా, వాటిని పట్టించుకోకపోవడం, మురుగు సమస్య ,విద్యుత్ చార్జీలతో పాటు, ఇంటి పన్ను, చెత్త పన్ను వంటి విషయాల్లో పట్టణాల్లో వైసీపీకి కాస్త వ్యతిరేకత కనిపిస్తోంది.కానీ పల్లెల్లో మాత్రం వైసిపి ప్రభుత్వం పై సానుకూలత ఉందని, జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలను అందుకుంటున్న లబ్ధిదారులంతా మళ్ళీ వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నట్లుగా అనేక సర్వేల్లో తేలింది.అయితే పట్టణ ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు కష్టమవుతుందనే సంకేతాలు వెలబడుతున్నాయి.
జగన్ మాత్రం అన్ని చోట్లా వైసీపీ జెండానే ఎగురుతుంది అనే ధీమాలో ఉన్నారు.