పీఆర్టీయూ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినం

సూర్యాపేట జిల్లా:నూతన సీపీఎస్ పెన్షన్ విధానాన్ని, పీఎఫ్ఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసి,పాత ఓపీఎస్ పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని పిఆర్టీయూ సూర్యాపేట జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి పప్పుల వీరబాబు డిమాండ్ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులు సెప్టెంబర్ 1వ,తేదీని పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని పీఆర్టీయూ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా గురువారం సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో పీఆర్టీయూ మండల శాఖ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కి వినతిపత్రం సమర్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యాతిధిగా హాజరై మాట్లాడుతూ పీఆర్టీయూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.ప్రభుత్వం కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి,పాత పెన్షన్ విధానం అమలు చేసే వరకు తమ సంఘం తరుపున పోరాడుతామని అన్నారు.

ఖచ్చితంగా పాత పెన్షన్ విధానాన్ని సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ మునగాల మండల శాఖ గౌరవ అధ్యక్షురాలు సాయి ఈశ్వరి,మండల అధ్యక్షులు కాసాని నాగేశ్వరావు,ప్రధాన కార్యదర్శి మేకల మధుబాబు,మండల అసోసియేట్ అధ్యక్షులు పందిరి రవీందర్ రెడ్డి,సీనియర్ నాయకులు సిరంగి రంగారావు,మండల కార్యవర్గ సభ్యులు సునీత, జ్యోతి,విశ్రాంత ఉపాధ్యాయులు ఓరుగంటి రవి, ఫాతిమా బేగం,విద్యా భవాని,వై.

జ్యోతి,శ్రీకాంత్ రెడ్డి,పల్లా శ్రీనివాస్,నాంచారయ్య,పీర్ సాహెబ్, అంబేద్కర్,వెంకటానారాయణ,కిరణ్,మంగమ్మ, ఆజాం బాబా,జాఫర్,నారాయణరెడ్డి, నరసింహారావు,సత్యనారాయణ,సైదులు,జమీల వేగం,మురళీమోహన్ రెడ్డి,కృష్ణ మోహన్, విజయనిర్మల,స్వాతి,భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
మహిళ సమాఖ్యలో భారీ కుంభకోణం.. 28 లక్షలు స్వాహా

Latest Suryapet News