ఒక్క అవకాశం ఇచ్చినందుకు అంటూ వైఎస్ జగన్ పై పవన్ సీరియస్ వ్యాఖ్యలు..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న “వారాహి విజయ యాత్ర” అమలాపురంలో కొనసాగుతుంది.ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నా ఆంధ్ర అనే భావనతో అన్ని కులస్తుల ప్రజలు వ్యవహరించాలని సూచించారు.ఆంధ్ర అనే భావన లేకపోతే మట్టి కలిసిపోతాం అని హెచ్చరించారు.

కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టడానికి అన్ని గొడవలు సృష్టించాలా అంటూ వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో పవన్ విరుచుకుపడ్డారు.ఆ గొడవలు విషయంలో తనకు చాలా బాధ కలిగిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.

కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టినప్పుడు సమస్య రాలేదు.అన్నమయ్య జిల్లా అనే పేరు పెట్టినప్పుడు సమస్య రాలేదు.

ఇక్కడ కోనసీమ అంబేద్కర్ అని పేరు పెట్టడానికి అభిప్రాయ సేకరణ అని చెప్పి గొడవలు సృష్టించారు అని ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.

Telugu Janasena, Pawan Kalyan, Ys Jagan-Telugu Political News

అంతకుముందు జిల్లాలకు పేరులు పెట్టేసినప్పుడు… కోనసీమకు కూడా పేరు పెట్టేయాలి.అంబేద్కర్ గారిని గౌరవిస్తున్నప్పుడు ప్రతి భారతీయుడు.ఆంధ్రుడు కూడా గౌరవించుకుంటారు.

మీరే కావాలని అభిప్రాయ సేకరణ అని చెప్పి ప్రశాంతమైన కోనసీమలో గొడవలు సృష్టించారని.వైసీపీ ప్రభుత్వం పై పవన్ అమలాపురం సభలో కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలో అమాయకంగా 250 మంది పై పెట్టిన కేసులు వెంటనే తొలగించాలని.అన్నారు.

రాష్ట్ర డిజిపి, చీఫ్ సెక్రటరీ అదేవిధంగా ముఖ్యమంత్రికి.ఇంకా పెద్దలకు రెండు చేతులు జోడించి వేడుకుంటున్నాను ఆ 250 మంది యువత పైన పెట్టిన కేసులు విత్ డ్రా చేయండి.

నిజంగా తప్పులు చేస్తే శిక్షించండి… అమాయకులను ఇబ్బంది పెట్టకండి.ఈ ముఖ్యమంత్రి ఒక్క అవకాశం ఇవ్వండి అనీ అధికారంలోకి వచ్చారు.

అతనికి ఒక్క అవకాశం ఇస్తే రెండు లక్షల 30 వేల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ రాకుండా చేశారు.ఒక్క అవకాశం ఇస్తే ఉభయగోదావరి జిల్లాల రైతాంగానికి.

రాష్ట్ర రైతాంగానికి కనీస మద్దతు ధర లేకుండా తీరని ద్రోహం చేశారు.ఒక్క అవకాశం ఇస్తే దళితులందరికీ అంబేద్కర్ విదేశీ విద్య పథకం తీసేసారు.

ఆ ఒక్క పథకం తో పాటు దాదాపు 20 నుండి 23 దళిత పథకాలు తీసేశారు.ఒక్క అవకాశం పేరిట ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు విడుదల చేయలేదు.

ఒక్క అవకాశం ఇస్తే ఉద్యోగస్తులకు నెలకి జీతాలు ఇచ్చే పరిస్థితి  లేకుండా చేశారు ఈ ముఖ్యమంత్రి.కాబట్టి వచ్చే ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం కావాలో వద్దో ప్రజలు ఆలోచించుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube