సినిమాల సంగతి సరే ! రాజకీయం సంగతే తేల్చాలి !

జనసేన అధినేత పవన్ కళ్యాణ్  ప్రస్తుతం సినిమా వ్యవహారాల్లో బిజీగా ఉన్నారు.ఇటీవలే విడుదలైన భీమ్లా నాయక్ రిలీజ్ అయిపోయింది.

 Pawan Kalyan Is Not Able To Devote Much Time To Janasena Party Affairs As He Is-TeluguStop.com

ఈ సినిమా కాస్త వివాదం రేపినా,  హిట్ టాక్ తెచ్చుకుంది.ఇక వరుసగా సినిమాలు చేపట్టేందుకు పవన్ కాల్షీట్లు ఇచ్చేశారు.

దీంతో కొంత కాలం పాటు సినిమా వ్యవహారాల్లో ఆయన బిజీగా ఉండబోతున్నారనే విషయం అర్థమవుతోంది.అయితే రాజకీయాల సంగతేంటి అనే చర్చ తెరమీదకు వస్తోంది.

మరో వైపు చూస్తే ఎన్నికలకు ఇంకా రెండు ఏళ్ల సమయం మాత్రమే ఉంది.దీంతో టీడీపీ, వైసీపీ, బీజేపీ వంటి పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి.
       అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి.అయితే  జనసేన పార్టీ లో మాత్రం ఈ సందడి అప్పుడప్పుడే కనిపిస్తోంది.పవన్ సినిమా వ్యవహారాలలో విరామం దొరికినప్పుడు యాక్టివ్ గా ఉంటూ క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ సభలు సమావేశాలు నిర్వహిస్తూ హడావుడి చేస్తున్నారు తప్పించి , పూర్తిస్థాయిలో ప్రజల్లో ఉండేందుకు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసే విషయంపై ఇప్పటికీ పవన్ దృష్టి పెట్టలేకపోతున్నారు.అప్పుడప్పుడు కొన్ని కొన్ని పార్టీ పదవులను భర్తీ చేస్తూ , ఏదో ఒక అంశంపై ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ , ఆ తరువాత సైలెంట్ అయిపోతున్నారు.
   

Telugu Bimla Nayak, Janasena, Janasenani, Pavan Kalyan, Telugudesam-Telugu Polit

   ఎక్కువ గా సినిమా వ్యవహారాల్లో బిజీగా ఉండడంతో వీడియో సందేశాలు ఇచ్చేందుకు, ప్రెస్ నోట్ లు విడుదల చేసేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు తప్పించి, పూర్తిగా రాజకీయాలపై దృష్టి సారించే అంతటి తీరిక లేకపోవడం జనసేన కు ఇబ్బందికరంగా మారింది.సినిమాలను రాజకీయాలను బ్యాలెన్స్ చేసుకునే విధంగా పవన్ ముందుకు వెళ్లకపోతే రానున్న రోజుల్లో జనసేన రాజకీయానికి ఇబ్బందికరంగా మారే అవకాశం లేకపోలేదు.ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జనసేన ప్రభావం ఎక్కువగానే కనిపిస్తోంది.రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ మద్దతు పొందేందుకు బిజెపి టిడిపి వంటి పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

జనసేన కోరినన్ని సీట్లు పొత్తులో భాగంగా ఇచ్చేందుకు టిడిపి సిద్ధంగానే ఉంది అయితే బిజెపి తో వ్యవహారం తేలిన తర్వాతే టిడిపితో పొత్తు ఖరారు అవకాశం ఉంటుంది.కానీ పవన్ ఇంకా ఏ విషయము తేల్చడం లేదు.

జనసేన రాజకీయ వ్యవహారాలన్నీ నాదెండ్ల మనోహర్ ఎక్కువగా చూస్తున్నారు కానీ  పవన్ పూర్తిగా రాజకీయాలపై దృష్టి సారిస్తే జనసేన కు రావాల్సినంత స్థాయిలో పొలిటికల్ మైలేజ్ వస్తుంది అనడంలో సందేహంలేదు.     

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube