ఎలక్ట్రిషన్ ను హత్యచేసి పూడ్చిపెట్టి పరారైన పెయింటర్...!

నల్లగొండ జిల్లా:నాగార్జునసాగర్ హిల్ కాలనీలో నూతంగా నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ లో వర్కర్లుగా పని చేస్తున్న ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణ ఒకరి ప్రాణం తీసిన ఘటన కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

నాగార్జున సాగర్ హిల్ కాలనీ మెయిన్ బజార్ లో పర్వతనేని నాగేశ్వరరావు@పెద్దబాబు నూతనంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు.అందులో హిల్ కాలానికి చెందిన రెహమాన్ (35)ఎలక్ట్రిషన్ గా పని చేస్తుండగా,శివారెడ్డి పెయింటింగ్ పనులు చేస్తున్నాడు.

Painter Who Killed Electricity And Buried It And Ran Away , Rahman, Parvatneni N

శనివారం అర్ధరాత్రి సమయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది.ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన పెయింటర్ శివారెడ్డి, ఎలక్ట్రిషన్ రెహమాన్ ను హత్య చేసి,శవాన్ని నూతన షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణలోనే పూడ్చి పరారయ్యాడు.

ఆదివారం ఉదయం షాపింగ్ కాంప్లెక్స్ లో రక్తపుమరకలు ఉండడం,శివారెడ్డి,రెహమాన్ ఇద్దరూ కన్పించకపోవడంతో కాంప్లెక్స్ ఓనర్ పెద్దబాబు పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కనిపించకుండా పోయిన ఇద్దరి గురించి విచారించి,ఇద్దరూ ఘర్షణ పడ్డారని తెలుసుకొని విచారణ చేపట్టారు.

Advertisement

సోమవారం కాంప్లెక్స్ కు వచ్చిన వాచ్ మెన్ కు వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించారు.వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించి,శవాన్ని బయటికి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక కమలా నెహ్రూ దవాఖానకు తరలించారు.

మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని,పరారీలో ఉన్న నిదితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Latest Nalgonda News