పసుపు దుంపజాతి పంట.పసుపు సాగుకు ( turmeric )మురికి నీటి పారుదల సౌకర్యం ఉండే నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి.
నీరు నిలువ ఉండే నేలలు, చౌడు నేలలు అనుకూలం గా ఉండవు.నేల యొక్క పీహెచ్ విలువ 5 నుండి 7.5 మధ్యలో ఉంటే పసుపు పంటలో అధిక దిగుబడి సాధించవచ్చు.పసుపు పంట సాగుకు అల్లేసి, రశ్మి ప్రభ, సుదర్శన, సుగంధం లాంటి రకాలు అనుకూలంగా ఉంటాయి.ఒక ఎకరాకు దాదాపుగా 1000 కిలోల విత్తనాలు అవసరం.6 నుండి 8 సెంటీమీటర్ల పొడవు గల దృఢంగా ఉండే మొలకెత్తిన మొగ్గలున్న పిల్ల కొమ్ములు అనుకూలంగా ఉంటాయి.వేసవికాలంలో ఆఖరి దుక్కిలో ఒక ఎకరం పొలంలో పది టన్నుల పశువుల ఎరువు( Cattle manure ) 10 టన్నుల చెరువు మట్టి వేసి కలియదున్నాలి.విత్తే సమయంలో 2500 కిలోల నాడెవ్ కంపోస్ట్ వేయాలి.125 కిలోల ఘన జీవామృతాన్ని వేసి దున్నుకోవాలి.
విత్తనాలను ముందుగా బీజరక్ష, బీజామృతం, పంచగవ్యలో( Bijaraksha, Bijamrutam, Panchagavya ) ముంచి ఓ అరగంట నానబెట్టిన తర్వాత నీడలో ఆరబెట్టి విత్తుకుంటే వేరు కుళ్ళు, తాటాకు తెగులు, ఆకు మచ్చ తెగులకు కారణమైన శిలీంద్రాలు దుంపలను ఆశించకుండా ఉంటాయి.నేలలో ఉండే తేమశాతాన్ని బట్టి నాలుగు నుండి ఆరు రోజుల వ్యవధిలో ఒకసారి నీటి తడి ఇవ్వాలి. బిందు సేద్యం ద్వారా పసుపులో అధిక దిగుబడి సాధించవచ్చు.
దుంప కుళ్ళు ఆశించినప్పుడు నీటి తడుల మధ్య వ్యవధి పెంచాలి.కాలువల మధ్య భూమిని పచ్చి ఆకులు లేదా ఎండు ఆకులతో కప్పి ఉంచాలి.
ఇలా చేయడం వల్ల పసుపు బాగా మొలకెత్తడమే కాకుండా కలుపు మొక్కలు అనేవి పెరగవు.
పసుపు పంట 210 నుండి 250 రోజుల మధ్య చేతికి వస్తుంది.పసుపు పంట పక్వానికి చేరుకున్న తర్వాత మొక్కల ఆకులు ఎండడం ప్రారంభం అవుతాయి.కలు ఎండిపోయే వరకు పంట కోయరాదు.
పసుపును త్రవ్వే రెండు రోజుల ముందు మొక్క యొక్క ఆకులు కాండాలను భూమట్టానికి కోయాలి.ఇక వెంటనే నీరు పెట్టిన రెండు రోజుల తర్వాత దుంపలు తవ్వకం ప్రారంభించాలి.
తవ్వి తీసిన వారం లోపల ఉడకబెడితే పసుపు నాణ్యత బాగా ఉంటుందని వ్యవసాయ క్షేత్రం నిపుణులు సూచిస్తున్నారు.